ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటికి “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” టీం సర్ప్రైజ్ ఇచ్చింది. ఈరోజు ఇంద్రగంటి పుట్టినరోజు కావడంతో “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఆయనకు సర్ప్రైజ్ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఇక సినిమా విషయానికొస్తే… సుధీర్ బాబు, ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. ఈ రొమాంటిక్ ను డ్రామా సుధీర్ బాబు, ఇంద్రగంటి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం. బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.