‘ఉప్పెన’తో తెలుగు చిత్రసీమలోకి సునామీలా దూసుకొచ్చింది అందాల ముద్దుగుమ్మ కృతీశెట్టి. మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో అవకాశాలు వెల్లువల పొంగుకొచ్చాయి. అయితే అదే సమయంలో ఆచితూచి అడుగులు వేయడం మొదలెట్టింది కృతి. నేచురల్ స్టార్ నాని సరసన ఆమె చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ కృతి కంటే… సాయిపల్లవికే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. ఇక ‘బంగర్రాజు’ సినిమాలో నాగచైతన్య సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం నితిన్ సరసన ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీలో…
‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాల తర్వాత హీరో సుధీర్ బాబు, డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కృతీశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి. మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కమర్షియల్ ఫిల్మ్ మేకర్‌గా,…
‘శ్రీదేవి సోడా సెంటర్’ తో పరాజయాన్ని చవిచూసిన సుధీర్ బాబు.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టడానికి గట్టిగానే కష్టపడుతున్నాడు. టాలీవుడ్ లో డిఫెరెంట్ ప్రేమకథలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను…
న్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేథా థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన “వి” చిత్రం థియేట్రికల్ రిలీజ్ అయ్యి నేటితో ఏడాది పూర్తి అవుతోంది. ఈ మూవీ 2020 సెప్టెంబర్ 5న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయ్యింది. వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి కూడా సహాయక పాత్రల్లో నటించారు. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన “వి” నానికి 25వ చిత్రం. ఇందులో నాని తన కెరీర్‌లో మొదటిసారి నెగటివ్ షేడ్ ఉన్న…
ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటికి “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” టీం సర్ప్రైజ్ ఇచ్చింది. ఈరోజు ఇంద్రగంటి పుట్టినరోజు కావడంతో “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఆయనకు సర్ప్రైజ్ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఇక సినిమా విషయానికొస్తే… సుధీర్ బాబు, ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. ఈ రొమాంటిక్…