తమిళ స్టార్ హీరో సూర్య, ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష కృష్ణన్ కాంబినేషన్‌లో చాలా కాలం తర్వాత వచ్చిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘వీరభద్రుడు’ (తమిళంలో ‘కరుప్పు’ – Karuppu). నటుడు – దర్శకుడు ఆర్‌జే బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై రెండు భాషల్లోనూ మొదటి వీకెండ్ (3 రోజులు) అద్భుతమైన వసూళ్లతో రచ్చ లేపింది. విడుదలకు ముందు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, థియేటర్లలోకి వచ్చాక ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చాలా ఏళ్ల తర్వాత సూర్య-త్రిషల వింటేజ్ కెమిస్ట్రీ, ఆర్‌జే బాలాజీ ఇంటెన్స్ స్క్రీన్‌ప్లే, సాయి అభ్యంకర్ ఊరమాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. అయితే, వీకెండ్ హంగామా ముగియడంతో ఈ చిత్రం అసలైన పరీక్షకు సిద్ధమైంది.
ఏ సినిమాకైనా మొదటి మూడు రోజులు (శుక్ర, శని, ఆదివారాలు) ఫ్యాన్స్ హడావుడి, వీకెండ్ అడ్వాంటేజ్ వల్ల భారీ వసూళ్లు రావడం సహజం. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్‌లో నిలబడి ‘క్లీన్ బ్లాక్‌బస్టర్’ అవ్వాలి అంటే.. మొదటి వర్కింగ్ డే అయిన సోమవారం (Monday) హోల్డ్ చాలా ముఖ్యం. కంటెంట్ పరంగా ‘వీరభద్రుడు’ సూర్యకు పర్‌ఫెక్ట్ కంబ్యాక్ ఫిల్మ్ అని ఆడియన్స్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. అయితే బాక్సాఫీస్ రికార్డుల పరంగా సూర్య గర్జన ఎంతవరకు ఉంటుందనేది ఈరోజు వచ్చే వసూళ్లు.. బుకింగ్స్ ట్రెండ్‌ను బట్టి తేలిపోనుంది.ప్రస్తుతం సమ్మర్ ముగుస్తున్న తరుణంలో థియేటర్లలో పెద్దగా వేరే సినిమాలు లేకపోవడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్. అటు తమిళనాడులో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ డ్రై సీజన్‌లో ‘వీరభద్రుడు’ కనుక ఈ సోమవారం స్టడీ బుకింగ్స్ అండ్ కలెక్షన్స్ మెయింటైన్ చేసి పాస్ మార్కులు సాధిస్తే.. ఇక ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద ఆపడం ఎవరితరం కాదు.
