కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. అందరి హీరోల గా కాకుండా విభిన్న పాత్రలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అందుకే ఆయనకు జాతీయ అవార్డు కూడా వరించింది. ఇక ప్రస్తుతం సూర్య వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ‘రెట్రో’ మూవీ ఒకటి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సూర్యకి జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా, జోజు జార్జ్, జయరామ్, నాజర్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Chhava : తెలుగులో విడుదలకు అడ్డంకులు ఎదుర్కొంటున్న ‘ఛావా’..!
కాగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. మే 1న విడుదల కానున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక అప్ డెట్ ఎంతో ఆకట్టుకోగా టీజర్‌తో అందరి దృష్టిని మరింత ఆకర్షించింది. దీంతో ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో ‘రెట్రో’ ఒకటిగా నిలిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య ఈ మూవీ గురించి తన అనుభవాలను పంచుకున్నాడు..
సూర్య మాట్లాడుతూ.. ‘ చెన్నైలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ‘రెట్రో’ మూవీ కోసం పెద్ద జైలు సెట్ ఏర్పాటు చేశారు. లైబ్రరీ, వంటగది అన్నిటినీ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు అద్భుతంగా తీర్చిదిద్దారు. అందులో ఐదు రోజులు ఓ పాట చిత్రీకరించారు. ఆ ఐదు రోజులు నిజంగా జైలులో ఉన్నట్లు అనిపించింది. ఆ పాటలో డాన్స్ మూమెంట్స్ కూడా బాగుంటాయి, టోటల్ గా మూవీలో అన్ని భావోద్వేగాల ఉంటాయి’ అని సూర్య తెలిపారు.