Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Scene Movie: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త యాక్షన్-కామెడీ చిత్రం ‘సీన్’ (#Scene) తెలుగు ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేదికపై సూర్య మాట్లాడిన మాటలు, ముఖ్యంగా కల్ట్ క్యారెక్టర్ ‘రోలెక్స్’పై చేసిన కామెంట్స్ ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి ‘రోలెక్స్.. రోలెక్స్’ అనే నినాదాలు మిన్నంటడంతో స్పందించిన సూర్య.. తెరవెనుక లోకేష్ కనగరాజ్‌తో చర్చల ప్రక్రియ జరుగుతోందని స్పష్టం చేస్తూ, “చాలామంది హీరోలు వచ్చారు.. ఇప్పుడు ఒక బలమైన విలన్ కావాలి!” అంటూ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించారు.
వేదికపై అభిమానుల కేకలతో హోరెత్తుతున్న సమయంలో సూర్య నవ్వుతూనే అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ‘రోలెక్స్’ గురించే కదా మీరంతా అడుగుతోంది.. లోపల చాలా ప్రాసెస్ జరుగుతోందని చెప్పారు. “లోకీకి (లోకేష్ కనగరాజ్) చెప్పండి.. నాకు ఫోన్ చేయమని, వచ్చి నన్ను కలవమని చెప్పండి.. కచ్చితంగా దాన్ని నిజం చేద్దాం” అంటూ బాంబు పేల్చారు. “హీరో బెటరా.. విలన్ బెటరా?” అని సూర్య ఆడియన్స్‌ను అడగ్గా.. అందరూ ముక్తకంఠంతో ‘విలన్’ అని అరిచారు. దానికి స్పందిస్తూ.. “ఎక్కువ మంది హీరోలు వచ్చేశారు, ఇప్పుడు ఒక సాలిడ్ విలన్ అవసరం ఉంది.. దాన్ని పక్కాగా చేద్దాం” అని హామీ ఇవ్వడంతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది.
Also Read
ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్ గురించి సూర్య పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దాదాపు 10-12 ఏళ్లుగా ఎంతోమంది స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లు అడిగినా నజ్రియా నో చెబుతూ వచ్చిందని, తాము కూడా మూడుసార్లు సంప్రదిస్తే రిజెక్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు. చివరకు నాల్గో ప్రయత్నంలో కథ నచ్చి ఆమె ఒప్పుకుందని తెలిపారు. సెట్స్‌లో ఆమె ప్రిపరేషన్, అంకితభావం అద్భుతమని.. ‘మాయ’ పాత్రను అత్యద్భుతంగా పండించిందని కొనియాడారు. ఎంతటి అనుభవం ఉన్నా ప్రతి షాట్ ముందూ ఆమెలో ఉండే ఆ చిన్నపాటి నెర్వస్నెస్ ఆమె నిజాయితీకి నిదర్శనమని ప్రశంసించారు.
‘రోమాంచం’, ‘ఆవేశం’ లాంటి బ్లాక్బస్టర్లతో క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు జిత్తు మాధవన్ ఈ సినిమాను పక్కా మర్డర్, మిస్టరీ, మ్యాడ్నెస్, ఫుల్ లాఫ్టర్‌తో తీర్చిదిద్దారని సూర్య స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటికే ‘వీరభద్రుడు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తర్వాత మూడోసారి వేదికపైకి రావడం ఒక బ్లెస్సింగ్‌గా భావిస్తున్నానని.. సోమవారం సాయంత్రం పనులన్నీ వదిలిపెట్టి గంటల తరబడి ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకుల అభిమానానికి ఎంత రుణపడినా సరిపోదని భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు ఇంట్రోవర్ట్‌గా ఉన్న తాను ఈ స్థాయికి రాగలిగితే.. ఎవరైనా తమను తాము నమ్ముకుని ఏదైనా సాధించగలరంటూ ‘నేనే బెస్ట్.. నేను ఏదైనా చేయగలను’ అనే స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చారు. దీపావళి సందర్భంగా నవంబర్ 6న థియేటర్లలోకి రాబోతున్న ‘సీన్’ చిత్రం ప్రతి కుటుంబం కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుందని, బాక్సాఫీస్ వద్ద మరోసారి తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ఉండాలని సూర్య కోరారు.
తాజావార్తలు
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
-
OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!