Suriya48 లోడింగ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya48 : భాషకు అతీతంగా అభిమానుల మనసులో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న నటుడు సూర్య. కోలీవుడ్ స్టార్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఈ స్టార్ హీరోకి తెలుగులో కూడా ఆ రేంజ్లో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం హీరో సూర్య తిరుగులేని ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఇటీవల విడుదలైన ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్నారాయన. ఈ మాస్ కమర్షియల్ సక్సెస్ జోష్‌లో ఉండగానే, సూర్య తన అభిమానులకు సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు వినిపిస్తుంది. తన 48వ ప్రాజెక్ట్ (#Suriya48) కోసం కల్ట్ క్లాసిక్ ‘జై భీమ్’ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్‌తో మళ్లీ చేతులు కలపబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
‘కరుప్పు’ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సూర్య, తన నెక్ట్స్ మూవీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (VAS) చేస్తున్న సంగతి తెలిసిందే, దీని తర్వాత జితు మాధవన్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సూర్య 47’ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌గా చేస్తున్నారని సమాచారం. ఈ మూడు చిత్రాల తర్వాత సూర్య మళ్లీ తన మార్క్ సోషల్ డ్రామా వైపు అడుగులు వేస్తున్నారని ప్రస్తుతం కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని ‘జై భీమ్’ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జై భీమ్’ ఓటీటీ వేదికగా విడుదలై, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సంచలన విజయం సాధించడమే కాకుండా న్యాయవ్యవస్థపై బలమైన ఇంపాక్ట్ చూపించిన విషయం తెలిసిందే.
Also Read
- Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
- Ram Charan : అందుకే నేను నాబాడీగార్డును అస్సలు బయట తిరగనివ్వట్లేదు.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్
- Imax in Hyderabad : ‘AMB ఐమాక్స్’.. మహేష్ బాబు, వెంకటేష్ లీగ్ కాంబోలో క్రేజీ మల్టీప్లెక్స్
- Jagapathi Babu: ఎడిటింగ్‌లో బలయ్యా.. 'పుష్ప 2'పై జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు?
ప్రస్తుతం వీరిద్దరి కాంబో తెరకెక్కబోతున్నట్లు జరుగుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఒక పవర్ఫుల్ రియల్ లైఫ్ బయోపిక్ అని తెలుస్తోంది. సమాజంలోని ఒక కీలకమైన సామాజిక అంశాన్ని బేస్ చేసుకుని జ్ఞానవేల్ ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. అయితే ఇది ‘జై భీమ్’ లేదా రీసెంట్గా రజనీకాంత్‌తో తీసిన ‘వేట్టయాన్’ లాగా పోలీస్ లేదా కోర్టు రూమ్ డ్రామా బ్యాక్‌డ్రాప్ కాదని, సరికొత్త కాన్సెప్ట్‌తో ఉండబోతోందని సమాచారం. తన జర్నలిజం కెరీర్లో తారసపడిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా డైరెక్టర్ ఈ కథను రాసుకున్నారట. ఈ చిత్రాన్ని సూర్య హోమ్ బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోతుందట. ఇప్పటికే డైరెక్టర్ చెప్పిన ఫైనల్ నరేషన్‌కు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం లైన్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తికాగానే, ఈ ఏడాది సెప్టెంబర్ లేదా చివర్లో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. 2027 సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది మేకర్స్ ప్లాన్ అని చెబుతున్నారు. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
-
Suriya48 లోడింగ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్!
-
Ram Charan : అందుకే నేను నాబాడీగార్డును అస్సలు బయట తిరగనివ్వట్లేదు.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్
-
Vijay Mallya: ఆర్సీబీ హిస్టారికల్ విన్‌పై విజయ్ మాల్యా క్రేజీ ట్వీట్.. ఏమన్నారంటే..
-
Vaibhav Sooryavanshi: యూనివర్స్ బేబీ బాస్‌పై LSG యజమాని సంజీవ్ గోయెంకా ఎమోషనల్ పోస్ట్.. అప్పుడు స్టాండ్స్‌లో.. ఇప్పుడు రికార్డులు..!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!