Sunil Narang: ‘ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి’ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
- తెలంగాణ ఫిలిం ఛాంబర్లో కలకలం
- ఆఫీస్ బేరర్ల ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నా..
- అధ్యక్ష పదవికి ఏషియన్ సునీల్ నారంగ్ ఆకస్మిక రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Narang: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ‘ఏషియన్ సినిమాస్’ అధినేత సునీల్ నారంగ్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక రాజీనామా లేఖను ఛాంబర్ ప్రతినిధులకు పంపారు. ఛాంబర్ లోపల జరుగుతున్న అంతర్గత పరిణామాలు, ఒత్తిళ్ల వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆఫీస్ బేరర్ల ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నా..
తన రాజీనామా లేఖలో సునీల్ నారంగ్ పలు సంచలన విషయాలను ప్రస్తావించారు. ఛాంబర్లోని కొందరు ఆఫీస్ బేరర్ల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “కొందరు ఆఫీస్ బేరర్లను మెప్పించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ నాపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గి, నా మనస్సాక్షికి విరుద్ధంగా ఇకపై నేను ఇక్కడ పని చేయలేను” అని సునీల్ నారంగ్ స్పష్టం చేశారు.
Also Read
- Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
- Jayam Ravi: జయం రవి విడాకుల కేసులో షాకింగ్ ట్విస్ట్..!
- CM NTR: సీఎం ఎన్టీఆర్.. దద్దరిల్లిన థియేటర్
- Dragon Glimpse: 'డ్రాగన్' బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
ఏకాభిప్రాయం లేదు.. ఆరోగ్యం సహకరించడం లేదు
ఫిలిం ఛాంబర్ వంటి పెద్ద వ్యవస్థలో నిర్ణయాలన్నీ అందరి ఏకాభిప్రాయంతో జరగాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా జరగడం లేదని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు గత కొంతకాలంగా తన ఆరోగ్య పరిస్థితి కూడా ఆశించిన స్థాయిలో సహకరించడం లేదని, అందుకే ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. తక్షణమే తనను అధ్యక్ష బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ఛాంబర్ కమిటీకి ఆయన విజ్ఞప్తి చేశారు.
కొత్త అధ్యక్షుడిగా వారిద్దరి పేర్లు
తాను తప్పుకుంటున్న నేపథ్యంలో ఛాంబర్ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయాన్ని కూడా సునీల్ నారంగ్ సూచించారు. తన స్థానంలో తక్షణమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు పరిశ్రమకు చెందిన ప్రముఖులు శేఖర్ లేదా విజేందర్‌ల పేర్లను ఆయన సిఫార్సు చేశారు. వారిద్దరిలో ఎవరికైనా బాధ్యతలు అప్పగించవచ్చని లేఖలో పేర్కొన్నారు. సునీల్ నారంగ్ లాంటి సీనియర్ నేత, పరిశ్రమలో అందరితో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి ఇలా హఠాత్తుగా రాజీనామా చేయడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఛాంబర్లో నడుస్తున్న అంతర్గత విభేదాలు ఈ రాజీనామాతో ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మరి ఈ రాజీనామాను ఛాంబర్ పెద్దలు ఆమోదిస్తారా? లేదా ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారా? అనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
Sunil Narang: ‘ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి’ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
-
Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Yashasvi Jaiswal: వైభవ్ సూర్యవంశీ కాదు.. ఆ ఇద్దరే మా విజయానికి కారణం!
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!