SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో వైవిధ్యమైన, కథా బలమున్న చిత్రాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్నారు ధీరజ్ మొగిలినేని. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి విభిన్న చిత్రాలతో పాటు ‘డీజే టిల్లు’, ‘బేబి’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలలో భాగస్వామిగా ఉన్న ఆయన.. ఇప్పుడు తన ‘ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మన చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలను నెమరువేసేలా ఆయన నిర్మిస్తున్న బ్యూటిఫుల్ చిల్డ్రన్ మూవీ “సమ్మర్ హాలిడేస్”. సినిమాలోని “క్రష్ సాంగ్” యువ హీరో ఆనంద్ దేవరకొండ, స్టార్ ప్రొడ్యూసర్ ఎస్.కే.ఎన్ (SKN), డైరెక్టర్ ఆదిత్య హాసన్ చేతుల మీదుగా అత్యంత వేడుకగా లాంచ్ చేశారు.
ఈ క్ప్రొరమంలో డ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “చిన్నప్పుడు మనం ‘చిన్నారి చేతన్’, ‘బాల భారతం’, ‘లిటిల్ సోల్జర్స్’ లాంటి అద్భుతమైన బాలల చిత్రాలు చూసి ఎంజాయ్ చేసేవాళ్లం. కానీ ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలు రావడం బాగా తగ్గిపోయింది. ధీరజ్ మళ్లీ ఆ జానర్లో ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాటను ధీరజ్ నాకు ముందే వినిపించాడు, వినగానే నచ్చింది. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో మెప్పించిన సింజిత్ ఈ చిత్రానికి కూడా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఎంతో బ్యూటిఫుల్‌గా పాడారు.” అని కొనియాడారు.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
చదువుకుంటూనే సినిమాల్లో నటిస్తున్న బాలనటుల ఫోకస్‌ను అభినందిస్తూ ఎస్ కేఎన్ యువతకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. “ఈ రోజుల్లో క్రష్ అంటే ఒక వ్యక్తి అనుకుంటారు. కానీ మీ కెరీర్‌నే మీ క్రష్‌గా మార్చుకోండి. మన కెరీర్ బాగుంటే ఏ క్రష్ అయినా మన వెనకాలే రావాల్సిందే” అంటూ చమత్కరించారు. అలాగే వేదికపై పాత రోజులను గుర్తుచేస్తూ క్యాసెట్ లాంచ్ చేయడం తనలో పాత జ్ఞాపకాలను నింపిందని, తన సోదరుడు లాంటి ఆనంద్ దేవరకొండకు, ధీరజ్‌కు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!