NTV Telugu Site icon

Suguna Sundari Song Out: సుగణ సుందరి సాంగ్ వచ్చేసింది.. బాలయ్యా మాస్‌ ఎనర్జీ

1

1

Suguna Sundari Song Out: రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌ బాలకృష్ణ. ఆ జోనర్‌లో ఆయన తీసిన సినిమాలు సంచలన విజయాలు అందుకున్నాయి. అలాంటి నేపథ్య కథతో ఆయన చేసిన మరో సినిమా ‘వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి బ్యానర్‌పై నిర్మించారు. నటసింహ నందమూరి బాలకృష్ణ, అందాల బామ శృతి హాసన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డిలోని సుగుణ సుందరి పాట విడుదలైంది. ఈ పాటలో బాలకృష్ణ యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తుండగా, శృతి హాసన్ మల్టీ కలర్ డ్రెస్ లో ఆకట్టుకుంది. ఈ డ్యూయెట్‌లో లీడ్ పెయిర్ అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్‌తో అలరించారు. మొదటి పాట ‘జై బాలయ్య’ మాస్ నంబర్ అయితే, రెండోది సుగుణ సుందరితో డ్యూయెట్.

ఇక, ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిషి పంజాబీ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. బ్లాక్ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్‌గా పనిచేస్తున్నారు.త్వరలో చివరి పాట చిత్రీకరణతో చిత్రీకరణను పూర్తి చేయనున్నారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
Tamil Nadu: లారీ తాడే ఉరితాడైంది.. కానీ అదృష్టంగా బయటపడ్డ బైకర్

Show comments