Jatadhara : ఆసక్తికరంగా సుధీర్ బాబు ‘జటాధర’ సెకండ్ పోస్టర్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudheer Babu Jatadhara Striking Second Poster is here: వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో మెప్పిస్తోన్న నవ దళపతి సుధీర్ బాబు కథానాయకుడిగా రూపొందుతోన్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’. అనౌన్స్‌మెంట్ నుంచి పాన్ ఇండియా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ సినిమా 2025 శివరాత్రి విడుదలకు సన్నద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన కొత్త పోస్టర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచుతోంది. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా అంశాల కలయికగా ఈ సినిమా తెరకెక్కుతోందని విడుదలైన పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అలాగే అందులో సుధీర్ బాబు సరికొత్త లుక్‌తో, శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై జటాధర చిత్రం ఇండియన్ సినిమాల్లో ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసేలా రూపొందుతోంది. ఈ తరహా చిత్రాల రూపకల్పనకు ఇది నాంది పలికేలా కనిపిస్తుంది.
Tirumala Laddu Controversy: లడ్డూ వివాదం.. అల్లు అర్జున్ విలన్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
సూపర్ నేచురల్ శక్తితో అదరగొట్టే లుక్‌లో సుధీర్ బాబు కనిపిస్తున్నారు, అభిమానులు పోస్టర్‌ను చూసి సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై ఇప్పటికే ఉహాగానాలు చేస్తున్నారు. ఈ విలక్షణమైన సినిమాను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామా! అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో అంచనాలను మించేలా ఓ అద్భుతమైన సరికొత్త చిత్రాన్ని రూపొందించటానికి నిర్మాతలు ప్రేరణ అరోరా, శివివన్ నారంగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ అహర్నిశలు కష్టపడుతున్నారు. సినిమాలో హీరోయిన్‌గా ఓ ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనుంది. అలాగే ప్రతినాయకి పాత్రలో బాలీవుడ్ స్టార్ నటించనుంది. ఆ వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం జటాధర సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. పాన్ ఇండియా ప్రేక్షకులను ఈ చిత్రం అలరించనుందని సెకండ్ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. 2025లో విడుదలకు సిద్ధమవుతున్న జటాధర సినిమాతో ఓ అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించటానికి సిద్ధంగా ఉండండి. హరోంహర తరువాత సుధీర్ బాబు అక్టోబర్ 11న మా నాన్న సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
తాజావార్తలు
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?