మూడు భాషల్లో ‘స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్ అటాక్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
26/11 ముంబయి ఉగ్ర దాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళిగా జీ 5 ‘స్టేట్ ఆఫ్ సీజ్ : 26/11’ ను అందించింది. అది వీక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో పాటు విజయవంతమైన సిరీస్ గా పేరు తెచ్చుకుంది. ‘స్టేట్ ఆఫ్ సీజ్’ ఫ్రాంచైజీలో రెండో సీజన్ ‘స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్ అటాక్’ను ఒరిజినల్ మూవీగా తెరకెక్కించారు. ఇది శుక్రవారం నుండి ‘జీ 5’ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానుంది. దీన్ని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ హిందీ నటుడు అక్షయ్ ఖన్నా చాలా సంవత్సరాల తర్వాత ఆర్మీ యూనిఫామ్‌లో కనిపిస్తుండటం విశేషం.
‘స్టేట్ ఆఫ్ సీజ్: 26/11’లో ఎన్ఎస్జీ కమాండోగా నటించిన వివేక్ దహియాను ఈ ఒరిజినల్ మూవీలోనూ చూడవచ్చు. వీరితో పాటు పలు తెలుగు చిత్రాల్లో నటించిన మంజరి ఫడ్నవీస్, గౌతమ్ రోడె, సమీర్ సోని, పర్వీన్ దబాస్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ‘స్టేట్ ఆఫ్ సీజ్: 26/11’ రూపొందించిన కాంటిలో పిక్చర్స్ కి చెందిన అభిమన్యు సింగ్ ఈ చిత్రానికి నిర్మాత. ‘అభయ్ 2’కు దర్శకత్వం వహించిన కెన్ ఘోష్ దీనికి దర్శకుడు. 26/11 ముంబయి దాడుల సమయంలో ఎన్‌ఎస్‌జీకికి సెకండ్ ఇన్ కమాండ్ గా ఉన్న కల్నల్ (రిటైర్డ్) సందీప్ సేన్ ఈ స్టేట్ ఆఫ్ సీజ్ ప్రాజెక్టులకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తుండటం విశేషం.
Also Read
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Anupama - Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
తాజావార్తలు
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!