NTV Telugu Site icon

Bollywood : సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న స్టార్స్ కిడ్స్

Loveyapa

Loveyapa

బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ యుగం స్టార్టైంది. కపూర్ ఫ్యామిలీ, ఖాన్స్ ఫ్యామిలీ జోడీ కడుతున్నాయి. ఇప్పుడు యంగ్ తరంగ్ టైం వచ్చేసింది. ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ జోడీ క్యూరియస్ కలిగిస్తుంది. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ అతిలోక సుందరి శ్రీదేవి చిన్న తనయ ఖుషీ కపూర్ యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ సిల్వర్ స్క్రీన్ పైకి అఫీషియల్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ ఇద్దరు కలిసి ఒకేసారి బిగ్ స్క్రీన్ పైకి లవ్యాపాతో వస్తున్నారు. తమ సినీ కెరీర్ లో ఒక్కసారి కూడా జోడీ కట్టని అమీర్ అండ్ శ్రీదేవి చిల్డ్రన్ లవ్యాపాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.

Also Read : Jr.NTR – Kalyan Ram : బాబాయ్‌కి అబ్బాయ్‌ల విషెష్.. సోషల్ మీడియా షేక్

తమిళ హిట్టు మూవీ లవ్ టుడే రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్లీ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మచ్ యాంటిసిపెటెడ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న లవ్యాపా జునైద్ ఖాన్, ఖుషీకి చాలా కీలకం ఎందుకంటే జునైద్ ఖాన్ నటించిన మహారాజా, ఖుషీ యాక్ట్ చేసిన ద ఆర్చిస్ కూడా ఓటీటీలో వచ్చి సందడి చేశాయి. ఈ ఇద్దరికి ఇదే ఫస్ట్ సిల్వర్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్.
ఏజీఎస్ ఎంటర్ టైన్మెంట్, ఫాంటోమ్ బ్యానర్లపై తెరకెక్కుతోన్న లవ్యాపాకు అద్వైత్ చందన్ దర్శకుడు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్లను స్పీడప్ చేశారు మేకర్స్. ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్లీ కౌన్ కిన్నా జరూరీ సి సాగిపోయే ఎమోషనల్ సాంగ్ విడుదల చేశారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సినిమా ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ కు హిట్టు అందిస్తుందో లేదో చూడాలి.