Site icon NTV Telugu

Bollywood : సల్మాన్ ఖాన్ పై స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

Bollywood (1)

Bollywood (1)

కండల వీరుడు సల్మాన్ ఖాన్ చెప్పిన టైంకి రాడు అన్న టాపిక్ ఆపినా ఆగేటట్లు లేదు. ఏఆర్ మురుగుదాస్ మొదలు పెట్టిన ఈ చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. సికిందర్ డిజాస్టర్ కావడానికి సల్మానే కారణమని, సెట్‌కి ఆలస్యంగా వచ్చేవాడని, మార్నింగ్ తీయాల్సిన సన్నివేశాలు రాత్రి తీయాల్సి వచ్చేదని, దీని వల్ల ఎమోషనల్ సీన్స్ దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చాడు. దీనిపై రీసెంట్లీ కౌంటరిచ్చాడు సల్మాన్ ఖాన్. మదరాసి హీరో ఉదయం ఆరుగంటలకే వచ్చేసేవాడు అదేమైనా బ్రహ్మాండంగా ఆడిందా అంటూ సెటైర్ వేసే సరికి ఇష్యూ క్లోజ్ అయ్యింది అనుకున్నారు కానీ మళ్లీ చెలరేగింది. దానికి కారణమయ్యాడు బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ.

Also Read : Anil Ravipudi : పవన్ కళ్యాణ్ తో కాదు.. అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా ఫిక్స్.

ఓజీతో విలన్‌గా టాలీవుడ్ తెరంగేట్రం చేసి ఇమ్రాన్ హష్మీ హిందీలో హక్ అనే ఫిల్మ్ చేస్తున్నాడు. షా బానో వర్సెస్ అహ్మద్ ఖాన్ కేసు ఆధారంగా తెరకెక్కిన ఈ ఫిల్మ్ నవంబర్ 7న థియేటర్లలో రాబోతోంది. యామి గౌతమ్ ఫీమేల్ లీడ్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇమ్రాన్ హష్మీ తనలా చెప్పిన టైంకి షూట్‌కి వచ్చే అతికొద్దీ నటీమణుల్లో యామి గౌతమ్ అంటూ ఆమెను ప్రశంసించాడు. అక్కడితో ఊరుకున్నాడా, ఇప్పటికీ చాలా మంది యాక్టర్స్ చెప్పిన టైంకి సెట్‌కి రారు అనడంతో సల్లూ టార్గెట్ అయ్యేలా చేసింది.  హీరో ఇమ్రాన్ హష్మీ అన్నది ముమ్మాటికీ సల్మాన్ ఖాన్‌నే అంటున్నారు సోషల్ మీడియా సైనికులు. ఎందుకంటే టైగర్3లో కండల వీరుడితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఇమ్రాన్. సో అప్పుడు కూడా సల్లూభాయ్ ఇలాగే చేసి ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. మురుగుదాస్, ఇమ్రానే కాదు ఫ్రెండ్ అమీర్ ఖాన్ కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో “అందాజ్ అప్నా అప్నా” టైంలో సల్మాన్ షూట్‌కి లేటుగా వచ్చాడని మెల్లిగా అంటించాడు.మొత్తానికి బాలీవుడ్‌లో, సల్మాన్ లేట్ అటెండెన్స్ నెవ్వర్ ఎండింగ్ టాపిక్ అవుతున్నట్లే కనిపిస్తుంది.

Exit mobile version