Site icon NTV Telugu

Star Actress : స్టార్ హీరోయిన్ ఖాతాలో పాన్ ఇండియా ప్లాప్స్.. హోప్స్ అన్ని ఆ సినిమాపైనే

Kiara

Kiara

బాలీవుడ్ బ్యూటీఫుల్, ఛార్మింగ్ గర్ల్ కియారా అద్వానీ.. ప్రెజెంట్ పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయ్యింది. ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీతో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిన కియారా భరత్ అను నేను సినిమాతోను టాలీవుడ్ లోను ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక బాలీవుడ్ లో చేసిన లస్ట్ స్టోరీస్, కబీర్ సింగ్, గుడ్ న్యూస్ చిత్రాలతో లక్కీ లేడీగా మారింది. షేర్సా, భూల్ భూలయ్యా 2 చిత్రాలు ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. సత్య ప్రేమ్ కీ కహానీ తర్వాత పాన్ ఇండియా చిత్రాల హీరోయిన్ గా మారింది కియారా.

Also Read : Mass Maharaja : రవితేజ సరసన హీరోయిన్ గా సమంత..?

ఇక తనకు తిరుగులేదు అనుకున్న టైంలో రామ్ చరణ్- శంకర్ పాన్ ఇండియన్ మూవీ గేమ్ ఛేంజర్ సినిమా కియరాకు బ్రేక్ వేసింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత హృతిక్ రోషన్- తారక్ నటించిన వార్2 ఆమెకు మరో ప్లాప్ తెచ్చాయి. ఇక కియారా హోప్స్ అన్నీ టాక్సిక్ మూవీపైనే. యశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో కన్నడలోకి ఎంట్రీ ఇస్తుంది కియారా. ఇక ఈ ఏడాది తల్లిగా ప్రమోటైన కియారా అద్వానీ ఇక పలకరించేది వచ్చే ఏడాదే. నెక్ట్స్ ఇయర్ మార్చి 19న రిలీజౌతున్న టాక్సిక్ ను డీల్ చేస్తోంది లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేసేందుకు ఇంగ్లీషులోనూ తెరకెక్కిస్తున్నారు. మదర్ హుడ్ ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో పాన్ ఇండియా ఫిల్మ్ శక్తి షాలిని వదిలేసుకుంది ఈ భామ. ఇక ఆమె చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ టాక్సిక్.

Exit mobile version