SSMB29 : ఓటీటీ పోటీ స్టార్ట్ అయింది.. లైన్‌లో ఉన్న ప్లాట్‌ఫామ్స్ ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో అతి ప్రెస్టీజియస్‌గా రూపొందుతున్న చిత్రాల్లో SSMB29 టాప్‌లో ఉంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా మేకోవర్‌లో కనిపించబోతున్నారు. ఈ కాంబినేషన్‌పై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగిశాయి. షూటింగ్ ప్రారంభమై కొంత భాగం పూర్తి అయింది కూడా. అయితే, ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా విడుదల కాలేదు. ఫస్ట్ లుక్, టైటిల్, మేకింగ్ వీడియో ఏవీ బయటకు రాకపోయినా… బజ్ మాత్రం ఆకాశాన్నంటుతోంది.
Also Read : Dil Raju :ప్రశాంత్ నీల్ ‘రావణం’ అప్పుడే !
Also Read
- Film Federation Council: నేడు ఫిల్మ్ ఫెడరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం... కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- Jailer 2 OTT Deal: రిలీజ్ కు ముందే రజనీకాంత్ ‘జైలర్ 2’ సంచలనం.. రూ.160 కోట్ల ఓటీటీ డీల్?
- ED Summons : రామ్మా చిలకమ్మా.. నిధి అగర్వాల్ కు ఈడీ పిలుపు..
- Anupama Parameswaran: పీరియడ్స్ విషయంలోనూ అవమానించాడు.. మాజీ ప్రియుడి వేధింపులపై అనుపమ సంచలన వ్యాఖ్యలు
అయితే తాజాగా ఈ సినిమాను గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిలింనగర్ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఇది మాత్రం ఊహించదగిన విషయమే. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే పాన్-వరల్డ్ క్రేజ్, మహేష్ బాబు అంటే మాస్.. క్లాస్ బేస్. ఈ కాంబోకు ముందు నుంచే బడా ఓటీటీ సంస్థలు లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నెట్‌ఫ్లిక్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్‌ను భారీ ధరకు దక్కించుకున్నట్లు టాక్. అయితే ఈ డీల్‌పై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఇప్పటికైతే మేకర్స్ మౌనంగానే ఉన్నా, ఓటీటీ ఇండస్ట్రీలో మాత్రం ఈ డీల్ చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Virat Kohli-PV Sindhu: విరాట్ కోహ్లీ నా ‘బ్రదర్’.. పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Khandwa Stray Dog Menace: ‘డాగీ బ్రదర్’ వినూత్న నిరసన.. కుక్క వేషధారణలో కలెక్టరేట్‌కు.. అసలు కారణం ఇదే! (వీడియో)
-
Film Federation Council: నేడు ఫిల్మ్ ఫెడరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం… కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
Jailer 2 OTT Deal: రిలీజ్ కు ముందే రజనీకాంత్ ‘జైలర్ 2’ సంచలనం.. రూ.160 కోట్ల ఓటీటీ డీల్?
ట్రెండింగ్
-
గూర్ఖా రెజిమెంట్‌కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్‌గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!