టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ‘SSMB29’ ముందు వరుసలో నిలుస్తోంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ అండ్ అడ్వెంచర్ ఎంటర్టైనర్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ భారీ బడ్జెట్ పాన్-వరల్డ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ లాంటి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం మేరకు, ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read : Farah Khan : ప్రీమియర్ షో లో షారుక్, దీపిక డీప్ స్లీప్.. ఫరాఖాన్ రివీల్ చేసిన షాక్ స్టోరి
మొదట కెన్యాలో షూట్ చేయాలని భావించినప్పటికీ, అక్కడి పరిస్థితుల కారణంగా ప్లాన్ మార్చిన చిత్రబృందం, ఇప్పుడు టాంజానియాలోని అద్భుతమైన ప్రకృతి ప్రదేశాల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన ఒక్క విషయం కూడా అధికారికంగా ప్రకటించకుండా.. షూటింగ్ మాత్రం శరవేగంగా చేస్తూ పోతున్నారు జక్కన్న. కాగా సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖుల తో పాటు, ఇతర ప్రముఖ ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా భాగమయ్యే అవకాశముందట. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో మరో ఘనత సాధించేందుకు సిద్ధంగా ఉంది.
