NTV Telugu Site icon

SSMB 29 : రాజమౌళి – మహేశ్ బాబు సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే..?

Untitled Design (26)

Untitled Design (26)

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ తరహాలో  రానుందని,టైటిల్ ఇదే అని అలా ఒకేటేమిటి రకరకాల ఊహాగానాలు రోజుకొకటి వినిపించాయి.

Also Read : Raghava Lawrence : ఆ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయబోతున్న రాఘవ లారెన్స్..?

టాలీవుడ్ లో కనీసం షూటింగ్ కూడా స్టార్ట్ చేయకుండా ఇంతటి భారీ హైప్ రాబట్టిన ఏకైక సినిమా మహేశ్ రాజమౌళి సినిమా అనే చెప్పాలి. రాజమౌళి సినిమా కోసం లాంగ్ హెయిర్, బియర్డ్ తో ఉన్న మహేశ్ బాబు లుక్ తెగ వైరల్ గా మారింది. కాగా రానున్న రాజమౌళి పుట్టినరోజు కి SSMB29 కి సంబందించిన న్యూస్ ఉంటుందని తెలుస్తోంది. డిసెంబరు లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తో ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ జర్మనీలో మొదలుపెట్టనున్నట్టు యూనిట్ సభ్యుల సమాచారం. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమాను పక్కా ప్రణాళికతో రూపొందించేలా అందుకు తగినట్టుగా ప్లాన్ రూపొందించారని టాక్. త్వరలోనే యూనిట్ సభ్యులందరికి వర్క్ షాప్ నిర్వహిస్తారని యూనిట్ సభ్యులకు సమాచారం అందించారని వినికిడి. రెగ్యులర్ షూట్ ఎప్పుడు స్టార్ట్ చేసిన సరే ఈ సినిమానుఎట్టి పరిస్థితుల్లో 2028లో రిలీజ్ చేస్తారని యూనిట్ కీలక సభ్యులు తెలిపారు. అంటే మహేశ్ బాబును తెరపై చూడాలంటే 4 ఏళ్ళు ఆగక తప్పదన మాట

Show comments