SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli’s Varanasi Box Office Expectations: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటేనే బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు నెలకొంటాయి. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాల వసూళ్లను పరిశీలిస్తే.. ఈ విషయం ఇట్టే స్పష్టమవుతుంది. తాజాగా జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’పై కూడా ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
రూ.22 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్:
రాజమౌళి దర్శకత్వంలో 2001లో వచ్చిన ‘స్టూడెంట్ నంబర్ 1’ రూ.22 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించింది. ‘సింహాద్రి’ రూ.46 కోట్లు, ‘సై’ రూ.18 కోట్లు, ‘ఛత్రపతి’ రూ.36 కోట్లు, విక్రమార్కుడు’ రూ.36 కోట్లు, ‘యమదొంగ’ రూ.50 కోట్ల గ్రాస్ సాధించినట్లు గణాంకాలు ఉన్నాయి. ఇక జక్కన్న కెరీర్లో కీలక మలుపుగా నిలిచిన ‘మగధీర’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆ తర్వాత ‘మర్యాద రామన్న’ రూ.40 కోట్లు, ‘ఈగ’ రూ.130 కోట్ల వరకు వసూళ్లు సాధించాయి.
Also Read
జక్కన్న లెక్కలు మారాయి:
అయితే ‘బాహుబలి’తో రాజమౌళి సినిమాల బాక్సాఫీస్ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. 2015లో విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్’ సుమారు రూ.650 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించగా.. 2017లో వచ్చిన ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ ఏకంగా రూ.1,810 కోట్ల గ్రాస్‌తో భారీ రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ కూడా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,316 కోట్ల గ్రాస్ సాధించినట్లు లెక్కలు ఉన్నాయి. దీంతో రాజమౌళి తదుపరి సినిమా ‘వారణాసి’పై కూడా బాక్సాఫీస్ అంచనాలు భారీగా పెరిగాయి.
వారణాసిపై భారీ అంచనాలు:
ప్రస్తుతం ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసిపై రూ.2,000 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో భారీగా విడుదల కానుండటంతో ఈ స్థాయి వసూళ్లు సాధ్యమే అనే చర్చ జరుగుతోంది. జక్కన్న టేకింగ్, మహేశ్ బాబు స్టార్డమ్ ఈ సినిమాకు కలిసిరానున్నాయి. ఇప్పటివరకు ఇండియన్ సినీ చరిత్రలో రూ.2,000 కోట్ల మార్క్ దాటిన ఏకైక చిత్రం ‘దంగల్’. మరి దంగల్ రికార్డును 2027 ఏప్రిల్ 7న సినిమాను ప్రేక్షకుల ముందుకు రానున్న వారణాసి బ్రేక్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!