SS Rajamouli: చేతిలో ఎన్నో ఆఫర్లు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి బిగ్ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli Hollywood Plans: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వారణాసి అనంతరం రాజమౌళి ఏ సినిమా చేస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. వారణాసి తర్వాత రాజమౌళి బిగ్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. బ్రెజిల్లో జరుగుతున్న 50వ సావో పాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న జక్కన్న.. హాలీవుడ్లో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలనుందని చెప్పారు. దాంతో తన తదుపరి సినిమా హాలీవుడ్‌లోనే అని దర్శకధీరుడు ఓ హింట్ ఇచ్చారని నెటిజెన్స్ అంటున్నారు.
కనీసం ఒక్క హాలీవుడ్ చిత్రానికైనా దర్శకత్వం వహించాలని ఉందని ఎస్ఎస్ రాజమౌళి తన మనసులో మాటను తాజాగా వెల్లడించారు. ‘ఆర్ఆర్ఆర్ అనంతరం హాలీవుడ్ నుంచి నాకు చాలా ఛాన్సెస్ వచ్చాయి. కానీ అప్పటికే వారణాసి నిర్మాణ పనులు మొదలు పెట్టాను. ఒకే సమయంలో నేను 2-3 సినిమాలకు పనిచేయలేను. ఒక మూవీ పూర్తయిన తర్వాతే.. నా దృష్టి మరో సినిమాపై పెడతాను. అప్పుడే 100 శాతం ఇవ్వగలుగుతాను. ఇప్పటికీ కొన్ని ఆఫర్లు నా చేతిలో ఉన్నాయి. వారణాసి పూర్తయ్యాక వాటి గురించి ఆలోచిస్తాను. హాలీవుడ్లో పని చేయడం నాకు చాలా ఇష్టం. అక్కడి పనితీరు, నిర్మాణాత్మక శైలి అద్భుతంగా ఉంటాయి. హాలీవుడ్ పరిశ్రమ నుంచి నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. కనీసం ఒక్క హాలీవుడ్ చిత్రానికైనా దర్శకత్వం వహించాలని ఉంది’ అని జక్కన్న చెప్పారు.
Also Read
- Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
- Srinidhi Shetty: ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో నాకే తెలీదు
- Aadarsha Kutumbam Trailer: 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్లో వెంకీ మామ వైలెంట్ అవతార్ చూశారా!
- Thaman: త్రివిక్రమ్ వల్లే 'ఓజీ' సాధ్యమైంది: మ్యూజిక్ డైరెక్టర్ తమన్
ప్రస్తుతం జక్కన్న దృష్టి మొత్తం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి పైనే ఉంది. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్‌కు సంబంధించి తాజాగా రాజమౌళి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ మరో 10 రోజుల్లో ముగుస్తుందని చెప్పారు. వారణాసి 2027 ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
SS Rajamouli: చేతిలో ఎన్నో ఆఫర్లు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి బిగ్ ప్లాన్!
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
AP MPTC ZPTC Elections 2026: MPTC, ZPTC ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. పార్టీల వారీగా లెక్కలివే
-
Melania Trump: ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై మెలానియా ట్రంప్ కీలక ప్రకటన
-
Afghanistan Tri Series Win: అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్థాన్.. ట్రై సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!