SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli Completes 25 Years in Cinema: ఓ దర్శకుడి కెరీర్లో 25 ఏళ్లు పూర్తవడం అనేది ఎంతో ప్రత్యేకమైన మైలురాయి. కానీ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విషయంలో ఇది కేవలం ఓ వార్షికోత్సవం మాత్రమే కాదు.. భారతీయ సినిమా కలలు కనే విధానమే మారిన ఓ సుదీర్ఘ ప్రయాణం. 2001లో జూనియర్ ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నంబర్ 1’తో మొదలైన జక్కన్న ప్రయాణం.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘వారణాసి’ వరకు చేరుకుంది. ఈ 25 ఏళ్ల రాజమౌళి సినీ ప్రయాణం ఎంతో గొప్పగా సాగింది. కథలు మారాయి, హీరోలు మారారు.. మార్కెట్ పెరిగింది.. కానీ ఇంకా పెద్దగా చేయాలనే జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు.
భారతీయ సినిమా మార్కెట్ దాటి:
తొలి సినిమా స్టూడెంట్ నంబర్ 1తోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. ఆ తర్వాత ‘సింహాద్రి’, ‘సై’, ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ వంటి విభిన్న చిత్రాలతో తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నారు. ప్రతి సినిమాతో తనను తాను ఆదిగమించేందుకు ప్రయత్నిస్తూ.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారు. జక్కన్న కెరీర్లో ‘బాహుబలి’ సిరీస్ కీలక మలుపుగా నిలిచింది. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ చిత్రాలతో భారతీయ సినిమా మార్కెట్ పరిధిని మరింత విస్తరించారు. భారీ కథ, విజువల్ గ్రాండియర్, యాక్షన్ సన్నివేశాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
Also Read
ఇంకా కొత్తగా ఏం చేయాలి:
‘ఆర్ఆర్ఆర్’తో రాజమౌళి పేరు అంతర్జాతీయ స్థాయిలో మరింత మార్మోగింది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూసిన హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరాన్, స్టీవెన్ స్పీల్బర్గ్ వంటి ప్రముఖులు రాజమౌళి పనితీరును ప్రశంసించడం ఆయన అంతర్జాతీయ గుర్తింపుకు మరో ఉదాహరణగా నిలిచింది. దీంతో తెలుగు సినిమా నుంచి మొదలైన ఆయన ప్రయాణం భారతీయ సినిమా స్థాయిని దాటి ప్రపంచ ప్రేక్షకుల వరకు చేరింది. అయితే రాజమౌళి సినిమాల అసలు ప్రత్యేకత కేవలం భారీ బడ్జెట్లోనే లేదని ఆయన కెరీర్‌ను పరిశీలిస్తే అర్థమవుతుంది. ప్రతి సినిమా పూర్తయిన తర్వాత.. ‘ఇంతకంటే ఇంకా పెద్దగా, ఇంకా కొత్తగా ఏం చేయాలి?’ అనే ఆలోచనతో ముందుకు సాగడమే ఆయన ప్రయాణంలో కనిపించే ప్రధాన లక్షణం. సినిమా తర్వాత సినిమా తన స్థాయిని తానే పెంచుకుంటూ వెళ్లారు.
కథలు మారాయి, హీరోలు మారారు:
ఈ 25 ఏళ్లలో కథలు మారాయి.. ఎందరో హీరోలు మారారు.. సినిమా మార్కెట్ ఎంతో మారింది.. ప్రేక్షకుల అభిరుచులు మారాయి. కానీ రాజమౌళి ఆలోచనలో మాత్రం ఓ విషయం మాత్రం మారలేదని చెప్పొచ్చు. ప్రేక్షకులకు ఇంతకుముందెన్నడూ చూడని అనుభూతిని అందించాలనే తపన ఆయన ప్రతి సినిమాలోనూ కనిపించింది. ఇప్పుడు అదే ఆలోచనకు మరో భారీ రూపంగా ‘వారణాసి’ తెరకెక్కుతోంది. మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వెంచర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విజయాల జాబితా కాదు:
‘స్టూడెంట్ నంబర్ 1’ నుంచి ‘వారణాసి’ వరకు.. 25 ఏళ్లలో రాజమౌళి ప్రయాణం కేవలం విజయాల జాబితా కాదు. ప్రతిసారీ తనను తానే సవాల్ చేసుకుంటూ.. భారతీయ సినిమా పరిధిని మరింత విస్తరించే ప్రయత్నం చేసిన దర్శకుడి ప్రయాణం. ఇక ‘వారణాసి’తో జక్కన్న ఎలాంటి కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారో చూడాలి.
తాజావార్తలు
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?