NTV Telugu Site icon

Srinu vaitla : వెంకీ – 2 లో హీరోగా ఎవరంటే..?

Venky

Venky

20 ఏళ్ల క్రితం రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ సినిమా అందరికీ గుర్తుంటుంది. ఇటీవల  కాలంలో వెంకీలోని కొన్ని సీన్స్  మీమ్స్ రూపంలో ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి.  వెంకీ పాత్రలో రవితేజ పండించిన కామెడీ ఏ ఎప్పటికి ఎవర్ గ్రీన్ గా నిలిచింది.  మరి ముఖ్యంగా సినిమాలోని ట్రైన్ సీక్వెన్స్ కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వేణు మాధవ్, AVS, బ్రహ్మానందం మధ్య వచ్చే ఆ ట్రైన్ సిక్వెన్స్ ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. కాగా గతంలో దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ ఈ సినిమాకి కొనసాగింపుగా వెంకి – 2 ను రూపొందిస్తామని చెప్పారు. ప్రేక్షకులు కూడా వెంకీ -2 ను ఎప్పుడు తీస్తారు, ఎవరితో తీశారు అని ఆసక్తిగా ఎదురు చూసారు.

Also Read : Viswam : సినిమా చూసేటప్పుడు మీకు నవ్వు ఆగదు: గోపిచంద్

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’.  దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానున్నఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడ్ శ్రీను వైట్లకు  వెంకీ 2 గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. యాంకర్ వెంకీ  సీక్వెల్ ను ఇప్పుడున్న ఏ హీరోతో తీస్తారనే ప్రశ్న శ్రీను వైట్లకు ఎదురైంది. ఈ ప్రశ్నకు శ్రీను వైట్ల జవాబు ఇస్తూ ‘ఈ  తరం హీరోల్లో అందరూ మంచి కామెడీ టైమింగ్ ఉన్నవాళ్లే. వారిలో ఎవ్వరికైనా వెంకీ – 2 కథ సూట్ అవుతుంది. తాను ఏ హీరోతో పనిచేస్తే వారితో ఫ్రెండ్దిప్ కొనసాగిస్తాను, ఈ హీరోతో చేస్తానో ఆ హీరో ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేస్తాను’ అని అన్నారు.

Show comments