Srinidhi Shetty: న్యూమరాలజీ గట్టెక్కిస్తుందా శ్రీనిధి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్మిక తర్వాత టాలీవుడ్‌లోకి కన్నడ కస్తూరీల హడావుడి బాగా పెరిగింది. శాండిల్ వుడ్‌లో కాస్త క్లిక్ అయ్యాక… తెలుగు ఇండస్ట్రీ పై ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో పాన్ ఇండియా చిత్రాల్లో జోడీ కట్టి బాలీవుడ్ దృష్టిని ఆకర్షించేందుకు ట్రై చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్‌లో ఇద్దరు భామలు ఇదే పనిలో ఉన్నారు. ఆ ఇద్దరే శ్రీనిధి శెట్టి అండ్ రుక్మిణీ వసంత్. ఏడాది గ్యాప్‌లో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు ఈ ముద్దుగుమ్మలు. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయ్యింది శ్రీనిధి. రుక్మిణీ.. సప్త సాగరాలు దాచే ఎల్లోతో యూత్ క్రష్ బ్యూటీగా మారింది. దీంతో ఆటోమేటిక్‌గా టాలీవుడ్ చూపు ఆమెపై పడింది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఫ్లాపైనా.. ఎన్టీఆర్ 31లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
Indra Ram: ‘ఐజీ’ నుంచి పుట్టిన కథ ‘చౌర్య పాఠం’.. ఆర్‌ఎక్స్ 100 అలా మిస్సయ్యా!
Also Read
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
రుక్మిణీ కన్నా యాక్టింగ్ కెరీర్ ముందు స్టార్ట్ చేసిన శ్రీనిధి.. తెలుగులో రావడానికి కాస్త ఆలస్యం అయ్యింది. కేజీఎఫ్ తర్వాత తమిళంలో విక్రమ్ సరసన కోబ్రా చేసింది. బొమ్మ డిజాస్టర్ కావడంతో మరో కోలీవుడ్ ఆఫర్ రాలేదు ఆమెకు. కానీ అదే టైంలో టాలీవుడ్ ఆమెను ఆదుకుంది. తెలుగులో టూ ఫిల్మ్స్‌లో నటించే ఛాన్స్ అందించింది. సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా.. నాని హిట్ 3 ఆఫర్లను కొల్లగొట్టింది శ్రీనిధి. హిట్ 3 కంప్లీట్ చేసుకుని మే 1న రిలీజ్ కాబోతుంది. కెరీర్, ఆఫర్ల పరంగా శ్రీనిధిని డామినేట్ చేస్తోంది రుక్మిణీ వసంత్. ఇప్పటికే ఏడు చిత్రాలు కంప్లీట్ చేసింది బఘీర బ్యూటీ. కానీ శ్రీనిధి ఇప్పటి వరకు చేసింది మూడే సినిమాలు. తెలుసుకదాతో పాటు.. కిచ్చా సుదీప్ మూవీస్ చేతిలో ఉన్నాయి. హిట్ 3 థియేటర్లలోకి వచ్చేస్తే.. ఇక మిగిలినవీ రెండే ప్రాజెక్టులు. ఏస్ రిలీజైతే రుక్మిణీ చేతిలో కూడా ఉండేవి రెండే అయినప్పటికీ.. క్రేజీయెస్ట్ సినిమాలు. మదరాసితో పాటు ఎన్టీఆర్ 31 చేస్తోంది బ్యూటీ. ఇక రుక్మిణీని క్రాస్ చేయాలంటే.. నాని చేతిలోనే ఆమె భవితవ్యం డిసైడ్ అయ్యి ఉంది. హిట్ 3నే ఆమె కెరీర్ గ్రాఫ్, ఆఫర్లు పెరిగే ఛాన్సులున్నాయి. దానికి తోడు కేజేఎఫ్ 1, కేజీఎఫ్ 2, ఇప్పుడు హిట్ 3, ఈ న్యూమరాలజీ తనకు కలిసివచ్చేలా ఉందని అంటోంది ఆమె. నాని ఆమెకు లక్కీ మాన్ అవుతాడేమో చూడాలి..
- Tags
- hit 3
- Nani
- Srinidhi Shetty
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!