NTV Telugu Site icon

Sri Lilla: బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో బోల్డ్ పాత్రలో శ్రీలీల..

February 7 (40)

February 7 (40)

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ అండ్ బిజీ హీరోయిన్‌లో శ్రీలీల ఒకరు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే చిన్న హీరోల నుంచి మిడ్ రేంజ్ అలాగే స్టార్ హీరోస్ తో నటించి తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. కాగా ప్రజంట్ శ్రీ లీల ఇపుడు మాస్ మహారాజ్ రవితేజతో ‘మాస్ జాతర’, నితిన్ తో ‘రాబిన్ హుడ్’, పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అలాగే తమిళ్ లో శివకార్తికేయన్ తో ‘పరాశక్తి’ అనే సినిమాలు చేస్తుంది. అలా అగ్ర హీరోలందరి సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పటి వరకు రోమాంటిక్ యాంగీల్‌కి కొంత ధూరంగా ఉన్న ఈ చిన్నది.. డ్రెస్సింగ్ విషయంలో  ఈ మధ్య కొంత గీత దాటుతోంది. ఇందులో భాగంగా తాజా సమాచారం ప్రకారం ఈ శ్రీలీల ఊహించని విధంగా ఓ బోల్డ్ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

Also Read: Thaman: వివాహ బంధం పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్..

ఆమె ఒకే చేసిన సినిమా ఏదో కాదు తెలుగులో క్రేజీ థ్రిల్లర్ హిట్ చిత్రం ‘మంగళవారం’. ప్రముఖ బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటించిన ఈ సినిమా గత 2023లో మంచి హిట్ అయ్యింది. దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాని విలేజ్‌లో నడిచే అఫైర్స్‌కి థ్రిల్ ఎలిమెంట్స్‌ తగిలించి తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ని కూడా అనౌన్స్ చేయగా. ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా ఇదే అఫైర్స్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగనుందట. కానీ ఇందులో పాయల్ రాజ్ పుత్ కొనసాగ పోవడం లేదని పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఈ పాయల్ ప్లేస్ లో స్టార్ బ్యూటీ శ్రీలీల నటించనుందట.  సినిమాలో పాయల్ ఎంత బోల్డ్‌గా నటించిందో మనం చూశాం. మరి శ్రీలీల పాత్ర కూడా అదే మాదిరిగా ఉంటుందా లేక కొత్తగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి దర్శకుడు ఈ ‘పార్ట్ 2’ స్క్రిప్ట్ పని పూర్తి చేశారట. అన్నీ సెట్ అయితే ఈ ఏడాదిలోనే సినిమా సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం. మరి శ్రీ లీల నిజంగా ఈ మూవీలో నటిస్తోందా?  తెలియాలి అంటే అప్ డేట్ వచ్చేంత వరకు వైట్ చేయాల్సిందే