Site icon NTV Telugu

Sreleela : ఈ ఏడాది ఒక్క హిట్ కూడా కొట్టని శ్రీలీల.. కారణం ఏంటి?

Sreleela

Sreleela

శ్రీలీలకు కెరీర్ స్టార్టింగ్ నుండి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన దాఖలాలు లేవు. ఒక్క హిట్ పడింది అనుకునేలోపు కనీసం రెండు ప్లాపులైనా ఆమెకు హాయ్ చెప్పాల్సిందే. ధమాకా తర్వాత స్కంధ రూపంలో డిజాస్టర్ వస్తే భగవంత్ కేసరి తర్వాత ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. గుంటూరు కారంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది అనుకునే లోపు రాబిన్ హుడ్, జూనియర్ చిత్రాలు ఝలక్ ఇచ్చాయి. ఈ ఏడాది ఇంకా మేడమ్ సక్సెస్ అకౌంట్ తెరవనే లేదు.

Also Read : Mass Jathara : మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ గా తమిళ స్టార్ హీరో

ఒక్క రెమ్యునరేషన్‌తోనే ఇటు హీరోయిన్ అటు స్పెషల్ సాంగ్‌కు సరిపడా ఫెర్మామెన్స్ చేసి నిర్మాతలకు ఆదాయాన్ని మిగిల్చేస్తోంది శ్రీలీల. ఆమె కష్టం ఒక్కొక్కసారి బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతోంది. జూనియర్‌లో వైరల్ వయ్యారీ అంటూ హుషారెత్తించి మిస్ లీల వైరల్ అయ్యింది కానీ సినిమా ప్లాప్ అయింది. అంతకు ముందు వచ్చిన రాబిన్ హుడ్ కూడా డిజాస్టర్ అయ్యేసరికి ఈ ఏడాది మిస్ లీలకు మిగిలిన హోప్ మాస్ జాతర మాత్రమే.  ధమాకాతో రవితేజతో మాసివ్ హిట్ అందుకున్న శ్రీలీల.. మరోసారి మాస్ మహారాజా ఫిల్మ్ మాస్ జాతరతో హిట్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తోంది. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ ఫిల్మ్ అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్‌తో పోటీపడబోతోంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాల పర్వంతో ఈ నెల చివరకు రాబోతుంది. మరి ఈ సినిమాతో శ్రీలీల ప్లాపులకు బ్రేకులేసుకుని.. హిట్టును తన ఖాతాలో వేసుకుంటుందో.? లేక కంటిన్యూ చేస్తుందో..? మరోసారి మాస్ మహారాజ్- డ్యాన్సింగ్ క్వీన్ పెయిర్ ఆకట్టుకుందో లేదో లెట్స్ వెయిట్

Exit mobile version