Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikanth Odela: వెండితెరపై తన కథను ఆవిష్కరించాలన్న కల చాలా మందికి ఉంటుంది. కానీ ఆ కలను నిజం చేసుకోవడానికి కొందరి మొండితనం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. లక్ష్యం కోసం ఎవరైనా నెల రోజులు చూస్తారు, మహా అయితే ఆరు నెలలు తిరుగుతారు. కానీ ఒక దర్శకుడి వద్ద శిష్యరికం కోసమే ఏకంగా మూడేళ్ల పాటు ప్రతిరోజూ వేకువజామునే వెళ్లి అపార్ట్మెంట్ మెట్ల కింద పడిగాపులు కాసిన కథ ఎప్పుడైనా విన్నారా? ‘దసరా’ సినిమాతో టాలీవుడ్‌ను షేక్ చేసి, ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’తో సంచలనాలను సృష్టించిన సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినీ ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సినిమా రంగంలోకి అడుగుపెట్టడానికి కారణమే లెక్కల మాస్టారు సుకుమార్‌ని ఆయన దగ్గర శిష్యరికం చేయడం తన లక్ష్యం అని డిసైడ్ అయ్యాడినట్లు తాజాగా ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్‌తో నిర్వహించిన చిట్‌చాట్‌లో చెప్పారు శ్రీకాంత్ ఓదెల. నిజానికి స్టార్ డైరెక్టర్ అయిన సుకుమార్ వద్దకు చేరడం అంత తేలికైన పని కాదు. దీంతో ఆయన దృష్టిలో పడటానికి శ్రీకాంత్ ఓ వింతైన, అసాధారణ మార్గాన్ని ఎంచుకున్నారు. అప్పట్లో సుకుమార్ హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఉండేవారు. శ్రీకాంత్ రోజూ తెల్లవారుజామున సరిగ్గా 5 గంటలకల్లా ఆ అపార్ట్మెంట్ కిందకు చేరుకుని నిశ్శబ్దంగా కూర్చునేవారు. రాత్రంతా స్టోరీ సిట్టింగ్స్, స్క్రిప్ట్ వర్క్‌లు ముగించుకుని సుకుమార్ అర్ధరాత్రి ఒంటిగంట లేదా రెండు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చేవారు. ఉదయం ఆయన బయటకు వచ్చే సమయానికి శ్రీకాంత్ అక్కడే ఉండేవారు. సుకుమార్ ఎదురుపడగానే “గుడ్ మార్నింగ్ సార్.. గుడ్ నైట్ సార్” అని చెప్పి, అంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయే వాడు.
ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. ఏకంగా మూడేళ్ల పాటు రోజు క్రమం తప్పకుండా ఇదే తంతు సాగింది. సుకుమార్‌తో ఆయన మాట్లాడేవి కేవలం ఆ రెండు మాటలే. మూడేళ్ల పాటు ప్రతిరోజూ తెల్లవారుజామునే తన కోసం ఎదురుచూస్తున్న ఆ యువకుడిని గమనించిన సుకుమార్‌కు మూడేళ్ల తర్వాత ఒకరోజు ఓపిక నశించి ఆశ్చర్యమేసింది. నేరుగా శ్రీకాంత్ దగ్గరకు వచ్చి.. “అసలు ఎవర్రా నువ్వు? ఏంటి నీ ప్రాబ్లమ్? ఏందిరా నీ గోల?” అంటూ అడిగినట్లు శ్రీకాంత్ ఓదెల చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. సక్కు సార్ నుంచి ఆ ఒక్క మాట కోసమే తాను మూడేళ్లుగా కళ్లు కాయలు కాచేలా వేచిచూసినట్లు చెప్పారు. ఆ క్షణంలోనే తన మనసులోని సినిమా పిచ్చిని, సుకుమార్ వద్దే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయాలన్న తన బలమైన కోరికను పూసగుచ్చినట్లు వివరించారు. ఎండనక, వాననక మూడేళ్ల పాటు తనకోసం గేటు వద్దే నిల్చున్న తన కళ్లలోని నిబద్ధత, సినిమాపై ఉన్న అమితమైన ప్యాషన్‌ను సుకుమార్ గుర్తించి కొన్ని పరీక్షలు పెట్టి, తనను తన డైరెక్షన్ టీమ్‌లోకి తీసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత సుకుమార్ దగ్గర నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసినట్లు చెప్పారు. ‘దసరా’తో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించిన శ్రీకాంత్ ప్రస్తుతం ది ప్యారడైజ్తో టాలీవుడ్లో మోస్ట్ సెన్సెషన్ డైరెక్టర్స్‌లో ఒకరిగా నిలిచారు. ప్యాషన్ ఉంటే ఏదైనా సాధ్యమేనని చెప్పడానికి శ్రీకాంత్ ఓదెల పడ్డ కష్టమే నిలువెత్తు సాక్ష్యం అని సోషల్ మీడియా వేదిక సినీ ప్రేమికులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Don't Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!