NTV Telugu Site icon

Sri Vishnu: ‘స్వాతిముత్యం’తో శ్రీ విష్ణు సినిమా..

Srivishnu

Srivishnu

శ్రీ విష్ణు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత హీరోగా నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో వంటి సూపర్ హిట్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను ఏర్పర్చుకున్నాడు. ఇక హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా శ్రీవిష్ణు సినిమాలను చేస్తూ వస్తున్నాడు. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన బ్రోచేవారెవరురా సినిమాతో శ్రీ విష్ణు బిగ్ హిట్ అందుకున్నాడు. కంటెంట్ బేస్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుని కెరీర్ సాగిస్తున్నాడు ఈ యంగ్ హీరో.

Also Read : OG : షూటింగ్ లో అగుడుపెట్టిన ఇమ్రాన్, ప్రియాంక

సమాజావారగమన తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు శ్రీ శ్రీవిష్ణు, అదే జోష్ లో తనతో రాజా రాజా చోర వంటి సూపర్ హిట్ తీసిన దర్శకుడితో SWAG సినిమా చేసాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా నిరుత్సహ పరిచింది. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు శ్రీ విష్ణు రెడీ అవుతున్నదని తెలుస్తోంది. బెల్లంకొండ గణేశ్‌ తొలి సినిమా ‘స్వాతిముత్యం’ దర్శకుడు లక్ష్మణ్ కృష్ణ శ్రీవిష్ణు తో ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. స్వాగ్ లా విభిన్న కథతో కాకుండా శ్రీవిష్ణు కు కలిసొచ్చిన ఫన్ కమర్షియల్ నేపథ్యంలో ఈ సినిమా రానున్నట్తు టాక్ వినిపిస్తోంది. ఇక నుండి ప్రయోగాలు జోలికి పోకుండా సెట్ అయ్యే కథలతో మార్కెట్ పెంచుకునే ఆలోచనలో ఉన్నాడు శ్రీ విష్ణు. రెండవ సినిమా కూడా నిర్మాత నాగవంశీ కి చేయాల్సిన కారణంగా శ్రీ విష్ణు సినిమా కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లోనే చేయబోతున్నాడు దర్శకుడు లక్ష్మణ్ కృష్ణ

Show comments