Tollywood : టాలీవుడ్ ‘ఫ్లాప్’ బ్యూటీస్‌కు కోలీవుడ్ రెడ్ కార్పెట్!

Sree Leela Bhagyasree Borse

Sree Leela Bhagyasree Borse

టాలీవుడ్ ఫ్లాప్ బ్యూటీస్‌కి కోలీవుడ్ ఫ్లాట్ అయిందా? డెబ్యూలో తడబడ్డా కూడా ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుందా? కెరీర్‌లో ఒక్క హిట్ కూడా చూడని గ్లామర్ బ్యూటీకి శివకార్తికేయన్ ఛాన్స్ ఇచ్చాడా? తమిళ తంబీలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఆ ఫెయిల్యూర్ భామలు ఎవరో చూద్దామా? ఫ్లాప్ బ్యూటీస్ శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సేలకు టాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్స్ లేకపోయినా, కోలీవుడ్ ఈ భామలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. కోలీవుడ్ డెబ్యూ ఫిలిమ్స్ ‘కాంత’, ‘పరాశక్తి’లతో తడబడ్డా.. ఈ ఇద్దరు భామలు చూపించిన పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిపోయారు తమిళ తంబీలు. దీంతో మేకర్స్ కూడా ఈ భామలకు ఛాన్సులు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు.

టాలీవుడ్ టాప్ బ్యూటీగా కొనసాగిన శ్రీలీల, గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలు చవిచూస్తోంది. యంగ్ బాయ్స్‌తో జతకట్టినా, స్టార్స్‌తో రొమాన్స్ చేసినా వర్కవుట్ కావట్లేదు. ఆల్మోస్ట్ తెలుగులో ఆఫర్స్ నిల్. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇద్దామన్నా.. ఆ మూవీ ఎప్పుడు ఫినిష్ అవుతుందో క్లారిటీ లేదు. ఇక ఆమెకు తమిళమే దిక్కయింది. ‘పరాశక్తి’లో డి-గ్లామర్ రోల్‌తో మెప్పించిన ఈ కిస్సిక్ బ్యూటీకి ధనుష్ 55వ మూవీలో ఛాన్స్ దక్కింది. అలాగే అజిత్ నెక్స్ట్ సినిమాకు కూడా హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు సమాచారం.

కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా చూడని భాగ్యశ్రీ బోర్సే.. టాలీవుడ్ మూవీ ‘లెనిన్’ లాస్ట్ హోప్ గా మారింది అనుకుంటున్న టైంలో, తమిళంలో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది. శివకార్తికేయన్ ‘సియోన్’ మూవీలో హీరోయిన్‌గా ఫిక్స్ అయింది ఈ గ్లామర్ బ్యూటీ. ‘తాయి కిళవి’తో ప్రూవ్ చేసుకున్న శివకుమార్ మురుగేషన్ ఈ మూవీకి దర్శకుడు; కమల్ హాసన్ నిర్మాత. తెలుగులో ఆఫర్స్ తగ్గుతున్న వేళ, తమిళ తంబీలకు చేరువయ్యేందుకు ట్రై చేస్తున్నారు ఫ్లాప్ బ్యూటీస్ శ్రీలీల అండ్ భాగ్యశ్రీ బోర్సే. ఇక్కడ దక్కని సక్సెస్ అక్కడైనా దక్కుతుందేమో లెట్స్ వెయిట్!