యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలుత కన్నడలో సినీ నటిగా రంగ ప్రవేశం చేసిన ఆమె తర్వాత తెలుగులో పెళ్ళి సందD అనే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఆమె ఆ తరువాత చేసిన దాదాపు అన్ని సినిమాలు ఆశించిన మేర ఫలితాలను అందుకోలేకపోతున్నాయి. ఆమె చేసిన ధమాకా సినిమా ఫర్వాలేదు అనిపించినా ఆ తరువాత చేసిన స్కంద దారుణమైన ఫలితాన్ని అందించింది. ఇక తర్వాత చేసిన భగవంత్ కేసరి సినిమా హిట్ అయింది కానీ క్రెడిట్స్ మాత్రం ఆమెకు దక్కలేదు. ఇక ఆ అనంతరం చేసిన ఆది కేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు కూడా తేడా పడ్డాయి. ఇక గుంటూరు కారం సినిమా రిజల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read; Kajal Aggarwal: హంసల ముస్తాబైన చందమామ…
ప్రస్తుతానికి ఆమె పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో కాకుండా మరిన్ని సినిమాల్లో కూడా ఆమె భాగమైంది. ఒకానొక సమయంలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఒప్పుకున్న ఆమె ఇప్పుడు డేట్స్ కుదరకపోవడంతో కొన్నిటి నుంచి బయటకు వస్తోంది. అయితే ఇప్పుడు ఆమె సరికొత్త సినిమాలో భాగమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాని అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో అజిత్ సరసన హీరోయిన్గా శ్రీలీలను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అజిత్ బాడీతో హైట్ తో పోల్చుకుంటే శ్రీ లీల ఆయన పక్కన సెట్ అవుతుందా?అంటే కాదనే చెప్పాలి. మరి ఏ కాన్ఫిడెన్స్ తో శ్రీ లీలను హీరోయిన్ గా సెట్ చేస్తున్నారో? సినిమా యూనిట్ కే తెలియాలి.