NTV Telugu Site icon

Special Shows: స్టార్స్ ఇమేజ్ పై స్పెషల్ షోస్ దెబ్బ

Box Office

Box Office

Special Shows: ఒకప్పుడు స్టార్ హీరోలు సంవత్సరంలో పలు చిత్రాలతో సందడి చేసేవారు. సూపర్ స్టార్ కృష్ణ అయితే ఒక్కో ఏడాది 12,13 సినిమాలు చేసిన సందర్భం కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని సంవత్సరాలు 6,7 చిత్రాలలో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మన స్టార్ హీరోలు ఏడాదికి ఒక చిత్రంతో రావటమే గగనం అయిపోతోంది. దీంతో ఆ యా హీరోల అభిమానులు తమ ఫేవరేట్ హీరో సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో అభిమానులు తమ హీరోల పుట్టిన రోజును గ్రాండ్ గా జరపటంతో పాటు ఆ యా హీరోల కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలను ల్యాండ్ మార్క్ డేట్స్ లో రీ రిలీజ్ చేసే సంప్రదాయం కూడా మొదలయింది. ఇది కొంత మేరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగినా ఆపై పెద్ద తలనొప్పిగా మారి ఆ యా స్టార్ హీరోల ఇమేజ్ ను దెబ్బతీసే వరకూ వెళుతోంది. మహేశ్ ఫ్యాన్స్ మొదలు పెట్టిన ఈ రీరిలీజ్ ట్రెండ్ ఇప్పుడు అందరు హీరోల చిత్రాలకూ పాకింది.

Read also: Hit-2 Urike Urike Full Song: ‘హిట్ 2’ నుంచి విడుదలైన రొమాంటిక్ సాంగ్ ‘ఉరికే ఉరికే’

ఈ రీ-రిలీజ్ లో ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘జల్సా’, ‘చెన్నకేశవరెడ్డి’ వంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు తరుణ్ ‘నువ్వే నువ్వే’ ఆడియన్స్ ను అలరించాయి. ఈ వారం ప్రభాస్ నటించిన ‘వర్షం’ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ ట్రెండ్ కమర్షియల్ యాంగిల్ కి దారితీయటంతో ప్లాఫ్ సినిమాలు, యావరేజ్ సినిమాలు కూడా రీ-రిలీజ్ కి క్యూ కట్టాయి. ఇటీవల ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘రెబల్’ రిలీజ్ కావటమే అందుకు ఉదాహరణ. ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది. ఎన్టీఆర్ యావరేజ్ సినిమా ‘బాద్‌షా’ స్పెషల్ గా రీ-రిలీజ్ కాబోతోంది. ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. ఈ రీరిలీజ్ సినిమాలు అన్నీ కూడా ప్రస్తుతం అమలులో ఉన్న కొత్త సినిమాల రేట్లతోనే ప్రదర్శితం కానుండటం గమనార్హం. ఇంకో విషయం ఏమిటంటే ఇలా రీరిలీజ్ అవుతున్న సినిమాల్లో ఎక్కువ భాగం యు ట్యూబ్ తో పాటు ఇతర ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులోనే ఉన్నాయి. సో ఇది కమర్షియల్ యాంగిల్ తో రిలీజ్ చేసే వారి సినిమాలపై పెద్ద దెబ్బ తీస్తుంది. అంతే కాదు ఆ యా హీరోల ఇమేజ్ ను కూడా తగ్గిస్తుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో హిట్ సినిమాలపై అభిమానులు, ప్రేక్షకుల అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలనే కోణంలో ఈ ట్రెండ్ కొనసాగితే మాత్రం నిరాశ ఎదురు కాక తప్పదు. అప్పుడు గత హిట్ సినిమాల రీరిలీజ్ ట్రెండ్ సమాధి అయినట్లే. చూద్దాం ఏం జరుగుతుందో!
Maoists Mulugu District: వ్యక్తిని దారణంగా చంపిన మావోయిస్టులు.. ఇన్‌ఫార్మర్‌ అంటూ లేఖ