సినిమా సెట్స్ లో ‘లైట్స్ ఆన్… స్టార్ట్ కెమెరా… క్లాప్… యాక్షన్… ‘ అనే పదాలు వినిపించిన తర్వాతే ఏ నటుడు, నటి అయినా యాక్టింగ్ చేయడం మొదలు పెడతారు. అయితే… వారి యాక్షన్ కు నటుడు సోనూ సూద్ యాక్షన్ కు ఎంతో తేడా ఉంది. సోనూసూద్ ‘నో లైట్స్… నో కెమెరా… ఓన్లీ యాక్షన్’ నినాదాన్ని గత కొంతకాలంగా జపిస్తున్నాడు. కరోనా తొలి విడుత సమయంలోనూ, మలి విడత సమయంలోనూ తన యాక్షన్ కు ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఎవరికి ఏ సహకారం కావాల్సి వచ్చినా తన వంతు సాయం చేస్తూనే ఉన్నాడు. అతని ఈ ‘యాక్షన్’ ఆగని గడియారంతో పోటీ పడుతోంది!
Read Also : “నారప్ప” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్
అందుకే సోనూసూద్ ను అభిమానించే వారి సంఖ్య, అతన్ని సోషల్ మీడియాలో అనుసరించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతోంది. తాజాగా సోనూసూద్ ను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 12 మిలియన్లకు చేరుకుంది. నటుడిగా కొద్దిమందికే సోనూసూద్ పరిచయం అయినా… ఇవాళ దేశ వ్యాప్తంగా… ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా ఓ గొప్ప మానవతావాదిగా ఎన్నో రెట్లు గుర్తింపును తెచ్చుకోవడం విశేషం.
