యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మరొక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఎన్టీఆర్. బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను సితార నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నారు.
Also Read : HHVM : హరిహర వీరమల్లు గ్రాండ్ సక్సెస్ మీట్.. ఎప్పడు.. ఎక్కడంటే
కాగా ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండంతో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ లో రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ 2 కోసం చేసిన ప్రమోషన్ సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఆకాశాన్ని కంపించేసారు జూనియర్ NTR ఫ్యాన్స్. “NTR WAR 2” అని స్కై రైటింగ్ తో మేఘాలను చెరిపేసారు. ఎన్టీఆర్ గత సినిమా దేవర టైమ్ లో సముద్రంలో సొరచేపకు NTR ఫోటో చూపించడం కార్లతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా సెలబ్రేట్ చేయడం వంటివి చేసారు. ఈ సారి ఏకంగా ఆకాశంలో వార్ 2 సెలెబ్రేషన్స్ చేసారు. ఇక ఈ నెల 25న వార్ 2 ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. అందుకోసం రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని సెలెక్ట్ థియేటర్స్ లో స్క్రీనింగ్ చేసేలా ఏర్పాట్లు కూడా చేసేసారు. ట్రైలర్ రిలీజ్ ను ఫ్యాన్స్ భారీగా సెలెబ్రేట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక రోజు ముందుగా ప్రీమియర్స్ కూడా వేసేలా ప్లాన్ చేస్తున్నాడు నాగవంశీ.