Site icon NTV Telugu

మరో తమిళ హీరోతో రష్మిక రొమాన్స్

Sivakarthikeyan to romance Rashmika Mandanna

కోలీవుడ్‌లోని ప్రతిభావంతులైన హీరోలలో ఒకరైన శివకార్తికేయన్ చివరిసారిగా 2019లో “హీరో” చిత్రంలో తెరపై కనిపించారు. కరోనా వైరస్ మహమ్మారి రాకపోయి ఉంటే ప్రస్తుతం విడుదల కోసం ఎదురు చూస్తున్న ఆయన చిత్రాలు చాలా కాలం క్రితమే తెరపైకి వచ్చేవి. ఈ యంగ్ హీరో నటించబోయే ఆసక్తికరమైన ప్రాజెక్టుల విషయానికొస్తే “డాక్టర్”, “అయలాన్”, “డాన్” వంటి కొన్ని చిత్రాలను వరుసగా లైన్ లో పెట్టాడు. ఇది కాకుండా శివకార్తికేయన్ హీరోగా ఒక తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం రూపొందనుంది. ఇదే శివకార్తికేయన్ కు తెలుగులో మొదటి చిత్రం అవుతుంది.

Read Also : రాజ్ కుంద్రా పోర్న్ వివాదంలోకి మనోజ్ బాజ్ పాయ్

‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్ ను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించనుంది. ఈ చిత్రం హిందీ, మలయాళ భాషలలో కూడా విడుదల కానుంది. ఈ భారీ ప్రాజెక్ట్ లో కన్నడ సోయగం రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Exit mobile version