ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా చేసుకుంది. ఈ క్రమంలో నిర్మాతల్లో ఒకరైన శిరీష్ మాట్లాడుతూ ‘‘పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేము మొదట థ్యాంక్స్ చెప్పాల్సింది ఎన్టీఆర్ ఆర్ట్స్ హరికి. ఆయన లేకపోతే ‘పటాస్’ చూసేవాళ్లం కాదు.
Director Bobby: ఇద్దరు హీరోలను లైన్ లో పెట్టిన డైరెక్టర్ బాబీ ?
అనిల్ ఈరోజు మాతో ఉండేవాడు కాదు. అప్పుడు మా కాంపౌండ్‌లోకి వచ్చిన అనిల్‌ను బయటకు పోనీయడం లేదు, ఆయన లేకపోతే ఈరోజు మేము లేము అని అన్నారు. ఈరోజు జరిగిన ప్రాబ్లంకి, అనిల్ ఎప్పుడూ అనేవాడు, షూటింగ్ జరుగుతున్నపుడు ‘ఈ సినిమా మీ మొత్తం ప్రాబ్లమ్స్ అన్నిటినీ పరిష్కరిస్తుంది’ అని. పైన తధాస్తు దేవతలు ఉన్నారేమో, నిజంగా అదే నిజమైంది. మేము బావిలో పడిపోతున్నామని ఎంతో మంది సంతోషపడేలోపు ఈ సినిమా మమ్మల్ని పక్కన పడేసింది. ఆ క్రెడిట్ అనిల్‌కే దక్కుతుంది అని అన్నారు.. వెంకటేశ్ నిర్మాతల హీరో. ఒక నిర్మాత కుమారుడు కాబట్టి, ఎప్పుడూ నిర్మాత క్షేమమే కోరుకుంటారు’ అని శిరీశ్ చెప్పుకొచ్చారు. .