Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్ కమ్ నిర్మాతల మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. గత కొంతకాలంగా అంతర్గతంగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు బహిరంగంగా ఒక్కసారిగా పేలింది. ఈ వివాదం ప్రధానంగా రెండు గ్రూపులుగా విడిపోయిన నిర్మాతలు, మరియు సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణపై నడుస్తోంది. తాజాగా జరిగిన పరిణామాలతో శిరీష్, సునీల్ నారంగ్, చదలవాడ శ్రీనివాసరావు వంటి ప్రముఖులు ఒక పక్షాన ఉండగా.. నవీన్ ఎర్నేని, నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి వంటి వారు మరో పక్షాన నిలిచారు.
ఈ గొడవకు ప్రధాన కారణం థియేటర్ల రెంట్ మరియు పర్సంటేజ్ విధానం. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ‘పర్సంటేజ్’ విధానం కావాలని డిమాండ్ చేస్తుండగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ మాత్రం ‘రెంటల్’ విధానాన్నే సమర్థిస్తోంది. నైజాం ఏరియాలో గత నెల రోజులుగా సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజ్ విధానం అమలవుతోంది. అయితే ఈ గొడవ కారణంగా ఇటీవలే విడుదలైన ‘జెట్లీ’ సినిమా సింగిల్ స్క్రీన్లలో ప్రదర్శనకు నోచుకోలేకపోయింది. జూన్ 4న చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల కానుంది. ఈ భారీ చిత్రం రిలీజ్‌కు ముందు సింగిల్ స్క్రీన్ల సమస్య తలెత్తడం చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ సింగిల్ స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శించకపోతే ఓపెనింగ్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. నాగవంశీ చెప్పినట్టు ఈ వివాదాన్ని చిరంజీవి వరకు తీసుకువెళ్తే పెద్ది ఇష్యూ వరకు సాల్వ్ చేస్తారా లేదా ఇండస్ట్రీ పెద్దగా ముందుకు వచ్చి రెండు గ్రూపులను కూర్చోబెట్టి అసలు సమస్యను పరిష్కరిస్తారాఅన్నది చూడాలి.
Also Read
- Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
- Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
- Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
- Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
తాజావార్తలు
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
-
Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
-
Amaravati Championship 2026: నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్.. బరిలో 14 వేల మంది క్రీడాకారులు!
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క