Kotha Malupu : ఆసక్తికరంగా ‘కొత్త మలుపు’ ట్రైలర్

Kothamalupu

Kothamalupu

ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా భైరవి అర్ధ్యా హీరోయిన్ గా నటించగా శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వలో తాటి బాలకృష్ణ నిర్మించిన ‘కొత్త మలుపు’ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ట్రైలర్ పరిశీలిస్తే గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ప్రేమకథలో ప్రేమ, సస్పెన్స్, వినోదం సమపాళ్లలో ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో ఆకాష్, భైరవి బావ–మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని యశ్వంత్ నాగ్ అందించారు. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాట్లాడుతూ, రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్‌లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది” అని తెలిపారు.

×
×
Ad