టాలీవుడ్ సహా దక్షిణాది భాషలలో పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడిన సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ మేరకు తాజాగా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా సమాచారం. దీంతో ఆమెను స్థానిక హాలిస్టిక్ అనే ఆసుపత్రికి తీసుకు వెళ్లారు పోలీసులు. ఆమె ప్రస్తుతం నిజాంపేట పరిసరాలలో నివాసం ఉంటుంది. నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్ లో తన భర్తతో కలిసి కల్పన నివాసం ఉంటుంది. అయితే రెండు రోజుల నుంచి కల్పన డోర్ ఓపెన్ చేయకపోవడంతో అపార్ట్మెంట్ వాసులకు అనుమానం వచ్చింది.
Nothing phone 3a: సరికొత్త ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో వచ్చేసిన నథింగ్ ఫోన్ 3a సిరీస్
ఆ తర్వాత అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత ఎంతకు తలుపు తీయకపోవడంతో పోలీసులు డోర్ ఓపెన్ చేశారు. అయితే అప్పటికే కల్పన స్పృహలో లేక పోవడంతో స్థానిక హోలిస్టిక్ హాస్పిటల్ కి పోలీసులు ఆమెను తరలించారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె స్పృహలోకి వచ్చిందని ప్రస్తుతం ఆమె స్టేట్మెంట్ రికార్డు చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందా లేక ఏం జరిగిందనే విషయం మీద ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.