Sing Geetham : రిలీజ్లో లాస్ట్ మినిట్ ట్విస్ట్.. వెనక్కి తగ్గిన నాగ్ అశ్విన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
94 ఏళ్ల వయసులో కూడా సరికొత్త ఉత్సాహంతో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రయోగాత్మక చిత్రం ‘సింగ్ గీతం’. వైవైజంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై స్టార్ ప్రొడ్యూసర్ నాగ్ అశ్విన్ ఎంతో ప్యాషన్‌తో నిర్మించిన ఈ చిత్రంపై టాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ముందే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం జూన్ 11, 2026 (గురువారం) నాడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావాల్సింది. కానీ, తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదల తేదీలో చివరి నిమిషంలో ఒక ఊహించని మార్పు జరిగినట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీ ఇన్నర్ సోర్సెస్ ప్రకారం.. ‘సింగ్ గీతం’ చిత్ర మేకర్స్ ఈ సినిమాను ఒక రోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నారు. గురువారం (జూన్ 11) కి బదులుగా, వారాంతపు కలెక్షన్లను పూర్తిగా క్యాష్ చేసుకోవాలనే ప్లాన్‌తో జూన్ 12, 2026 (శుక్రవారం) నాడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు గట్టిగా బజ్ వినిపిస్తోంది. అలానే పెద్ది లాంటి పెద్ద సినిమా ఉండగా వీక్ డేస్ లో వేరే సినిమాలకు ఇవ్వడానికి ఆలోచిస్తారు. ఈ క్రమంలో
ఈ లాస్ట్ మినిట్ పోస్ట్పోన్మెంట్కు సంబంధించిన కారణాలు ఇంకా పూర్తిగా బయటకు రానప్పటికీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం వల్ల కూడా ఈ ఒక రోజు మార్పు జరిగి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ తాజా విడుదల తేదీ మార్పుపై చిత్ర నిర్మాణ సంస్థలైన వైజయంతి మూవీస్ మరియు స్వప్న సినిమాస్ నుంచి అతి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయాన్, అహల్య, శాలిని ప్రధాన పాత్రల్లో రాబోతున్న ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నాన్‌స్టాప్ మ్యూజిక్ అందించారు. డైలాగ్స్ అన్నీ పాటల రూపంలోనే ఉండే ఈ సరికొత్త ప్రయోగాత్మక చిత్రం.. జూన్ 12న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
తాజావార్తలు
-
Sing Geetham : రిలీజ్లో లాస్ట్ మినిట్ ట్విస్ట్.. వెనక్కి తగ్గిన నాగ్ అశ్విన్!
-
ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్‌బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్‌లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
-
AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
-
Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!