Sindhooram: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ముఖ్య పాత్రధారులుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సిందూరం’ సినిమా మొదటి పాట ‘ఆనందమో ఆవేశమో’ విడుదలై ప్రజాదరణ పొందింది. వారం రోజులపాటు యూట్యూబ్ మ్యూజిక్ టాప్ 30లో ట్రెండింగ్ లో కూడా నిలిచింది ఈ పాట. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట చానల్ హ్యాక్ తో కనపడకుండా పోయింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండవ పాటను రిలీజ్ చేశారు. ‘ఓ మాదిరిగా’ అంటూ సాగే ఈ పాటను దర్శకుడు పరుశురామ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పాట చాలా బాగుంది. హరి సంగీతం ఫ్రెష్ ఫీల్ ను ఇచ్చింది. సత్య ప్రకాష్, హరిణి చక్కగా పాడారు. బాలాజీ సాహిత్యంతో పాటు లీడ్ పెయిర్ నటన కూడా చాలా బాగుంది’ అని కొనియాడారు. మొదటి పాటలాగే ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోందని డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి, ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి జంగా ఆశిస్తున్నారు.