NTV Telugu Site icon

Sikandar : హైదరాబాద్ లో సల్మాన్ ఖాన్.. సెక్యురిటీ ఫుల్ టైట్..

Murugadas

Murugadas

సల్మాన్‌ఖాన్‌ హీరోగా ఎఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సికందర్‌’. వరుస పరాజయాల తర్వాత సల్మాన్ ఖాన్, దర్శకుడు మురుగదాస్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సల్మాన్ సరసన కన్నడ భామ రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్నారు. తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Also Read : Matka : మెగా అభిమానులకు ప్రామిస్ చేసిన దర్శకుడు.. అంత నమ్మకం ఏంటో..?

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. ఇక్కడి రాయల్ ప్యాలెస్ అయిన ఫలక్ నుమా ప్యాలెస్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించ బోతున్నారు దర్శకుడు మురుగదాస్. కాగా ఈ షూట్ లో పాల్గొనేందుకు సల్లూ భాయ్ హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ రోజు జరగబోయే షూట్ లో సల్మాన్ పాల్గొనబోతున్నట్టు యూనిట్ తెలిపింది. మరోవైపు సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. సల్మాన్ ను చంపితే రూ.5 కోట్లు ఇస్తామని ప్రకటించడంతో పోలీసులు సల్మాన్ చుట్టూ భద్రత వలయం ఏర్పాట్లు చేసారు. పోలీసులు షూటింగ్ పరిసర ప్రాంతంలో ఎవరిని అనుమతించట్లేదు. కేవలం సినిమాకు చెందిన యూనిట్ ను మాత్రమే షూట్ లోకి అనుమతిఇస్తున్నారు. ఫుల్ టైట్ సెక్యురిటీ నడుమ సల్మాన్ ఈ షూట్ లో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉన్న సికందర్ వచ్చే ఏడాది ఈద్ కానుకగా రిలీజ్ కానుంది.

Show comments