యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి “సిగ్గెందుకురా మామ” అనే మాస్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సాంగ్ ను విడుదల చేస్తూ చిత్రబృందానికి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. ఈ చిత్రంలో ఇది మూడవ సాంగ్ కాగా… దీనిని అనురాగ్ కులకర్ణి ఆలపించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఇంతకుముందు ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ లాగే ఈ పాట కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
Read Also : ఈసారీ తొలి అడుగు వేసేది ఆ మెగా హీరోనేనా!?
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. “చూశాలే కళ్ళారా, చుక్కల చున్నీతో” సాంగ్స్ అయితే యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. టీజర్ కు కూడా మంచి స్పందనే వచ్చింది. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. థియేటర్లు ఎప్పడు తెరుచుకుంటే అప్పుడే తమ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలియచేశారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాలో హీరో తండ్రిగా సాయికుమార్ నటించగా, తనికెళ్ల భరణి, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. మీరు కూడా “సిగ్గెందుకురా” మాస్ సాంగ్ పై ఓ లుక్కేయండి మరి.