ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు మరవకముందే బాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. స్టార్ హీరోయిన్ సోదరుడు, వెటరన్ యాక్టర్ శక్తి కపూర్ తనయుడు సిద్దాంత్ కపూర్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.
అయితే.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ సిద్దాంత్ కపూర్ బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. ‘సిద్దాంత్ కు సోమవారం ఆలస్యంగా బెయిల్ వచ్చింది. అరెస్టయిన మిగతా నలుగురు కూడా బెయిల్‌పై విడుదలయ్యారని పోలీసులు తెలిపారు. సిద్ధాంత్ కపూర్ తో పాటు మరో నలుగురు పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంటుందని తూర్పు బెంగళూరు డిప్యూటీ కమిషనర్ భీమా శంకర్ గుల్లెద్ తెలిపారు. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి 35 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
ఆదివారం (జూన్ 12) రాత్రి బెంగళూరులో పార్టీ జరుగుతున్న హోటల్‌పై పోలీసులు దాడి చేయగా పలువురు డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారించారు. వారిలో సిద్ధాంత్ కపూర్ కూడా ఉన్నట్లు ధృవీకరించారు. సిద్ధాంత్‌తోపాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిని ఉల్సూరు పోలీస్ స్టేషన్‌కు తరిలించినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సిద్ధాంత్ అరెస్ట్ అయిన కొద్ది గంటల తర్వాత ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో సిద్ధాంత్ డీజే ప్లే చేస్తూ కనిపించాడు. అతను ప్లే చేస్తున్న సంగీతానికి పార్టీలోని వారంతా డ్యాన్స్ చేయడం మనం చూడొచ్చు.
Drugs Case: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోదరుడి అరెస్ట్.. కారణం ఇదే..!!