టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం ‘శుభం’. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత ఎంతో నమ్మకంతో నిర్మించిన ఈ చిత్రం, హర్షిత్ మల్గిరెడ్డి, శ్రీయ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించగా సినిమా బండి ఫేం ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మే09న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీ లోకి రాబోతుంది.ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ చిత్రం జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.