Site icon NTV Telugu

Shruti Haasan : డైలామాలో శృతి హాసన్ కెరీర్

Sruthi Hassan

Sruthi Hassan

లవ్ బ్రేకప్ తమన్నాకు కలిసొచ్చినట్లే.. శృతికి కూడా ప్లస్ అవుతుందనుకుంటే.. డైలామాలో పడిపోయింది ఆమె కెరీర్. కూలీలో నటించిందన్న మాటే కానీ.. ఈమె కన్నా పూజా హెగ్డేకే హైప్ వచ్చింది. సినిమాలో శృతి కీ రోల్ అయినా.. మూడు నిమిషాలు ఆడిపాడిన మోనికా సాంగ్‌తో మొత్తం మార్కులు కొట్టేసింది పూజా. పోనీ బొమ్మేమైనా బ్లాక్ బస్టరా అంటే.. తమిళ ఆడియన్స్‌కు కూడా పెద్దగా ఎక్కలేదు. పెద్ద స్టార్లు.. సూపర్ డైరెక్టర్ లోకేశ్ అన్న హైప్‌తో ఆడిస్తే.. 500 కోట్లకు చేరుకోవడం కష్టమైంది.

Also Read : Bahubali vs KantaraChapter1 : బాహుబలి ఎపిక్ కు పోటీగా కాంతార ఇంగ్లీష్ వర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే

కూలీతో శృతి కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని అనుకుంటే.. అక్కడే ఆగిపోయింది. ఈ సినిమా తర్వాత ఒక్క మూవీకి కమిటైన దాఖలాలు లేవు. పోనీ కథలు వింటుంది టైం పడుతుంది అని చెప్పుకోవడానికి.. కనీసం శృతి ఆ సినిమా చేయబోతుందట, ఈ దర్శకుడితో కొలబరేట్ కాబోతుందట అన్న వార్తలు కూడా రావడం లేదు. ఇదే కాదు మేడమ్ కంప్లీట్ చేసిన చిత్రం కూడా థియేటర్లలోకి రావడానికి మీన మేషాలు లెక్కిస్తోంది. తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ అనే మూవీ చేసింది శృతి. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమా ఎప్పుడో కంప్లీటైనా రిలీజ్‌కు నోచుకోవడం లేదు. ఇక ప్రభాస్ సలార్2లో ఉందన్న మాటే కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు. ఇక హాలీవుడ్ మూవీ ది ఐ కూడా 2023లోనే కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ అల్రెడీ గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగై ప్రశంసలు దక్కించుకుంది. కానీ థియేటర్లలోకి వచ్చేందుకు వెనకా ముందు ఆలోచిస్తోంది. మరి ఈ సినిమాలన్నీ వచ్చేదెప్పుడో.

Exit mobile version