లవ్ స్టోరీలు బెడిసి కొట్టడంతో తమన్నా, శృతి హాసన్.. మళ్లీ ప్రేమ జోలికి పోలేదు. ప్రేమ దోమ జాన్తా నై అని ఫిక్సైన బ్యూటీలు కెరీర్‌పై గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. చూడబోతే బ్రేకప్స్ ఇద్దరి భామల విషయంలో మంచే జరిగింది. ఎందుకో శృతి హాసన్‌కు లవ్ మ్యాటర్ ఫస్ట్ నుండి కలిసి రాలేదు. ఆమె ప్రేమలో పడిన ప్రతిసారి చేదు అనుభవమే ఎదురైంది. సమంత, కాజల్, తమన్నాకు టఫ్ ఫైట్ ఇవ్వాల్సిన టైంలో కెరీర్ కన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చి వెనుకబడింది కమల్ డాటర్. లండన్‌కు చెందిన నటుడు మైఖేల్ కోర్సేతో రెండేళ్ల పాటు డేటింగ్ చేసింది.. 2019లో ఈ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. కానీ ఏడాదికే తన మదిలో మరొకరికి మనసు ఇచ్చింది శృతి.
Also Read:Bad Girlz: ‘ఇలా చూసుకుంటానే’ అంటున్న ‘బ్యాడ్ గాళ్స్’
డూడుల్ ఆర్టిస్ట్ శంతను హాజారికాతో లవ్‌లో పడ్డ శృతి.. నాలుగేళ్ల పాటు ఆ ట్రాక్ నడిపింది. శంతనుతో రిలేషన్లో ఉన్నంత సేపు క్లోజ్‌గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి.. తమ రిలేషన్ చెప్పకనే చెప్పేసింది. కానీ లాస్ట్ ఇయర్ విడిపోయిన తర్వాత ఇక లవ్ అచ్చిరావడంలేదని త్వరగానే గ్రహించిన మేడమ్ మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేసింది. శాడ్ మూమెంట్స్ మర్చిపోయేందుకు వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు వర్క్ చేస్తోంది. కూలీ రీసెంట్లీ థియేటర్లలోకి రాగా, ట్రైన్, జననాయగన్, ఆకాశంలో ఓతారలో నటిస్తున్నట్లు టాక్. ఇక ప్రేమే కాదు.. పెళ్లి కూడా జాన్తా నై అంటోది భామ. ప్రస్తుతానికి లవ్ చేసేంత తీరిక.. మ్యారేజ్ చేసుకునే ఓపిక లేదని ఓపెన్ స్టేట్ మెంట్స్ ఇచ్చింది.
Also Read:Rahul Gandhi: రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకోవడానికి యత్నించిన వ్యక్తి.. కట్‌చేస్తే…(వీడియో)
విజయ్ వర్మ ప్రేమలో పడి సినిమాలపై కాన్సట్రేషన్ తగ్గించేసింది తమన్నా.. చెప్పాలంటే తమ్ముతో లవ్ ట్రాక్ నడిపి విజయ్ వర్మ ఫేమ్ తెచ్చుకున్నాడు కానీ.. మిల్కీ బ్యూటీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. ఇక ఈ ఏడాది కటీఫ్ చెప్పుకున్నారు ఈ లవ్ బర్డ్స్. లవ్ డ్రామా నుండి త్వరగానే బయటపడిన తమన్నా.. మళ్లీ బిజీ అవుతోంది. ప్రజెంట్ రేంజర్, వివాన్ తో పాటు మరో టూ బాలీవుడ్ ప్రాజెక్టులకు కమిటైందని తెలుస్తోంది. ఇక ఇప్పట్లో మరోసారి ప్రేమ జోలికి వెళ్లేట్లే లేదు అమ్మడు. మొత్తానికి లవ్ ట్రాక్ శృతికి, తమన్నాకు.. వీళ్ల కెరీర్‌పై దెబ్బేసినప్పటికీ.. బ్రేకప్స్ మంచే చేశాయ్..
