తెలుగు, తమిళం, హిందీ భాషల్లోని ప్రేక్షకుల మన్ననలు పొందిన శృతి హాసన్, తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎలాంటి తొందరలు లేకుండా, నిజాయితీగా ముందుకు తీసుకెళ్తుంది. తండ్రి కమల్ హాసన్ వంటి లెజెండరీ నటుడి కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తనదైన స్టైల్‌తో గుర్తింపు పొందిన శృతి, తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ చర్చనీయాంశంగా మారాయి.
Also Read : Viajay & Manchu : విజయ్ దేవరకొండ పై.. మనోజ్ కౌంటర్
ప్రేమలో రెండు విఫలం అయిన శృతి హాసన్ ప్రేమ జీవితంలో కొన్ని మలుపులు తీసుకుంది.. మొదట లండన్‌కి చెందిన నటుడు మైఖేల్ కోర్సెల్ తో దీర్ఘకాలం ప్రేమలో ఉండి, చివరకు మనస్పర్థలతో విడిపోయింది.ఆ తరువాత శంతను హజారికా అనే డిజైనర్‌తో ప్రేమలో పడింది. ఈ సంబంధం మూడు సంవత్సరాల పాటు కొనసాగినప్పటికీ, పెళ్లి వరకు వెళ్లలేకపోయింది. ఈ రెండు ప్రయాణాలు విఫలమైన నేపథ్యంలో శృతి హాసన్ ప్రేమ, పెళ్లి గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాస్త భావోద్వేగంగా, అర్థవంతంగా కనిపిస్తున్నాయి.
‘పెళ్లి అంటే అంత సులభం కాదు. పెళ్లి అంటే ఇద్దరి మధ్య నిబద్ధత, బాధ్యతలు, పరస్పర అర్థం కావడం అవసరం. ఒకరికి మాత్రమే ఉంటే అది కుదరదు. నాకు ఒంటరితనం కొత్త కాదు. జీవితంలో చాలా ఏళ్లుగా ఒంటరిగా ఉన్నాను. అలాంటి సమయంలో నేర్చుకున్న అనుభవాలు జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడ్డాయి. ముఖ్యంగా సింగిల్ మదర్‌గానే ఉండే పరిస్థితి వస్తే ఎలా? అనే ఆలోచన కూడా భయంకరంగా ఉంటుంది. సింగిల్ పేరెంట్‌గా ఉండటం ఎంత కష్టం నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా అలాంటి కుటుంబంలో పెరిగాను. అదే బాధలు నా జీవితంలోకి తీసుకోవాలనుకోవడం లేదు. పెళ్లి మీద నమ్మకం ఉంది కానీ అది జీవితంలో అవసరమా కాదా అన్న సందేహం ఉంది’ అంటూ తన అభిప్రాయం తో శృతి ఒక రకంగా అందరికీ ఓ నిజమైన భావనను చెప్పింది.