Site icon NTV Telugu

Shruti Haasan: ఏఐ టెక్నాలజీతో మెరిసిపోతున్న శ్రుతి హాసన్

Sruthi Hassan Men Xp

Sruthi Hassan Men Xp

హీరోయిన్ శ్రుతి హాసన్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత, సినిమాల విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుస్తుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు అభిమానులు, నెటిజన్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటిస్తుంటారు. అలాగే ఆమె టెక్నాలజీ వాడకంలో కూడా ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా ఆమె MensXP మ్యాగజైన్ అక్టోబర్ 2024 ఎడిషన్ కోసం ఏఐ టెక్నాలజీని వాడి ఫోటో షూట్ చేశారు. ఈ ఏఐ టెక్నాలజీ వాడి చేసిన ఫోటో షూట్ చూస్తుంటే భవిష్యత్ ప్రపంచంలో ఇంకెన్ని వింతలు చూపించవచ్చో సరదాగా హింట్ ఇస్తున్నట్టు ఉంది.

Yash: యష్ కి ఊహించని షాక్.. ఏమైందంటే?

ఇక ఈ ఫోటోలలో శృతి హాసన్ టైమ్-ట్రావెలింగ్ మోడ్ లో కనిపిస్తోంది. శ్రుతి హాసన్‌ను ఈ మ్యాగజైన్ ఒక “ప్రకృతి శక్తి”గా వర్ణించింది. శ్రుతి హాసన్ మరోపక్క ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్‌తో కలిసి “కూలీ” సినిమా చేస్తున్నారు. తండ్రి కమల్ హాసన్ లాగే శ్రుతి హాసన్ సైతం తనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించుకుంటూ సాగారు. తన తండ్రి ‘ఈనాడు’ సినిమాకు ప్రమోషన్స్ లో గళం విప్పిన శ్రుతి ఆ తరువాత “ఓ మై ఫ్రెండ్, త్రీ, రేసుగుర్రం, ఆగడు” చిత్రాల్లోనూ తెలుగు పాటలు పాడి అలరించారు. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కు కంపోజర్ గానూ పనిచేశారు. ఇటీవల కూడా ఒక లేటెస్ట్ సాంగ్ తో ఆకట్టుకున్నారు.

Exit mobile version