Yash: యష్ కి ఊహించని షాక్.. ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ మూవీ టీమ్‌కి అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే షాక్ ఇచ్చారు. విషయమైన చిత్ర బృందంపై కేసు నమోదు చేయాలని మంత్రి స్వయంగా ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (HMT) కెనరా బ్యాంక్‌కు విక్రయించినట్లు ఆరోపించిన అటవీ భూమిలో టాక్సిక్ మూవీని సెట్ చేయడానికి అనుమతి ఇచ్చారు. అయితే ఈ ఫారెస్ట్ ల్యాండ్ లో సెట్ కోసం చిత్ర బృందం చెట్లను నరికింది. ఈ నేపథ్యంలో పీణ్యలోని హెచ్‌ఎంటీ ప్లాంటేషన్‌లో చిత్ర టీమ్‌ని టార్గెట్ చేశారు మంత్రి. పీణ్య సమీపంలోని హెచ్‌ఎంటీ ప్లాంటేషన్‌లో రెండ్రోజుల పాటు షూటింగ్ ప్రారంభించిన మూవీ టీమ్.. నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోకుండా చెట్లను నరికివేశారు. అటవీ శాఖ నిబంధనల ప్రకారం ఇది నేరం. ముఖ్యంగా అటవీ భూమిలో చెట్లను నరకడం శిక్షార్హమైన నేరం. ఈ నేపథ్యంలో మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఎన్ని చెట్లను నరికివేశారు? నిబంధనల ప్రకారం దీనికి అనుమతి లభించిందా? అనుమతి ఇస్తే అటవీ భూమిలో చెట్ల నరికివేతకు అనుమతి ఇచ్చిన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Game Changer: మొన్న పుష్ప.. ఇప్పుడు గేమ్ ఛేంజర్!
Also Read
- Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
- Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్'తో యష్.. అంతా ఒట్టిదేనట!
- Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
- Vijay Deverakonda: 'రణబాలి'లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
అనుమతి లేకుండా చెట్టును నరికితే బాధ్యులైన వారందరిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. ఫారెస్ట్ క్రైమ్ కేసు పెట్టాలని మంత్రి ఈశ్వర్ ఖండ్రే సూచించారు. అనంతరం ఆ సెట్స్ సందర్శించి పరిశీలించిన అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే.. సినిమా సెట్ నిర్మాణం కోసం చెట్లను నరికిన చిత్ర బృందంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా అటవీశాఖ హెచ్చరించింది. మంత్రి ఈశ్వర ఖండ్రే దీని గురించి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ X,లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. ఆక్రమిత అటవీ భూమిలో ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ కోసం వందలాది చెట్లను అక్రమంగా నరికి ధ్వంసం చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ చట్టవ్యతిరేక చర్య శాటిలైట్ చిత్రాలను బట్టి స్పష్టంగా కనిపిస్తోందని, ఈరోజు ఆ స్థలాన్ని సందర్శించి పరిశీలించా. ఈ చట్టవ్యతిరేక చర్యకు బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించా. మన అడవులను, పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి ప్రధాన బాధ్యత. అటవీ భూముల్లో అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నానని పోస్ట్‌లో రాశారు.
ಎಚ್.ಎಂ.ಟಿ. ವಶದಲ್ಲಿರುವ ಅರಣ್ಯ ಭೂಮಿಯಲ್ಲಿ ‘ಟಾಕ್ಸಿಕ್’ ಎಂಬ ಚಲನಚಿತ್ರದ ಚಿತ್ರೀಕರಣಕ್ಕಾಗಿ ನೂರಾರು ಮರಗಳನ್ನು ಅಕ್ರಮವಾಗಿ ಕಡಿದು ಹಾನಿಗೊಳಿಸಿರುವ ವಿಚಾರ ಗಂಭೀರ ಚಿಂತೆ ಮೂಡಿಸಿದೆ. ಸ್ಯಾಟೆಲೈಟ್ ಚಿತ್ರಗಳಿಂದ ಈ ಅಕ್ರಮ ಕೃತ್ಯವು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಕಾಣುತ್ತಿದ್ದು, ಇಂದು ಸ್ಥಳಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿ ಪರಿಶೀಲನೆ ನಡೆಸಿದ್ದೇನೆ. ಈ ಅಕ್ರಮ ಕೃತ್ಯಕ್ಕೆ… pic.twitter.com/yrjHhG9kLA
— Eshwar Khandre (@eshwar_khandre) October 29, 2024
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!