Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shruti Haasan: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందిస్తున్న మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ ఎండార్స్మెంట్లు, తప్పుడు కంటెంట్‌పై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌కి సంబంధించిన కేసులో తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇలాంటి కృత్రిమ కంటెంట్ వ్యక్తిగత ప్రతిష్ఠ, గుడ్‌విల్‌కు తీవ్ర నష్టం కలిగిస్తుందని స్పష్టం చేసింది. జస్టిస్ మాధవ్ జమ్దార్ నేతృత్వంలోని ధర్మాసనం.. AI ద్వారా రూపొందించిన లేదా మార్చిన వీడియోలు, తప్పుడు ప్రకటనలు ఒక వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బతీస్తే, ఆ నష్టాన్ని కేవలం డబ్బుతో పూర్తిగా భర్తీ చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. ముఖ్యంగా ప్రజల్లో ఉన్న ఇమేజ్, వ్యక్తిగత గౌరవం, విశ్వసనీయతకు కలిగే నష్టం మరింత తీవ్రమైనదని పేర్కొంది.
ఈ సందర్భంగా వ్యక్తిగత గోప్యత, గౌరవానికి సంబంధించిన రాజ్యాంగ హక్కులను కూడా కోర్టు ప్రస్తావించింది. ఒక వ్యక్తి అనుమతి లేకుండా అతడి లేదా ఆమె ముఖం, పేరు, గుర్తింపును ఉపయోగించి తప్పుడు కంటెంట్ సృష్టించడం వల్ల కలిగే పరిణామాలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. తాజా కోర్టు తీర్పుపై శృతి హాసన్ అభిమానులు, సినీ వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. డిజిటల్ యుగంలో AI సాంకేతికత దుర్వినియోగాన్ని అడ్డుకునే దిశగా దీనిని కీలక ముందడుగుగా పలువురు అభివర్ణిస్తున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే ఇతర ఆర్టిస్ట్‌లకు కూడా ఈ తీర్పు ఉపయోగపడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆన్లైన్లో ఫేక్ వీడియోలు, డీప్‌ఫేక్‌లు పెరుగుతున్న నేపథ్యంలో.. వ్యక్తుల గౌరవం, గోప్యతను కాపాడేందుకు మరింత కఠినమైన చర్యలు అవసరమనే చర్చకు ఈ తీర్పు మరింత బలం చేకూర్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!