Site icon NTV Telugu

‘Stree’ : తన నవ్వు అలానే ఉంటుంది.. అందుకే ఈ క్యారెక్టర్ కు తీసుకున్నారు: అమర్ కౌశిక్

Sradha Dass

Sradha Dass

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లో శ్రద్ధాకపూర్ ఒకరు. అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు ఇటీవల ‘స్త్రీ 2’ మూవీతో హిట్ అందుకుంది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు సాఫ్ట్ క్యారెక్టర్‌లలో మాత్రమే అలరించిన శ్రద్ధా ను స్త్రీ2 లో ఇలాంటి పాత్రలో చూడటం కొత్తగా అనిపించింది. తన యాక్టింగ్ కి మంచి మార్కులు కూడా పడ్డాయి. అయితే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఈ చిత్ర దర్శకుడు అమర్ కౌశిక్, శ్రద్ధాకపూర్‌ను ఈ మూవీలో హీరోయిన్‌గా ఎంపిక చేసుకోవడంపై స్పందిస్తూ .. షాకింగ్ విషయాలు బయట పెట్టాడు.

Also Read: Tamannaah : ఆ సంఘటన నా జీవితంలో మర్చిపోలేను..

‘ ‘స్త్రీ’ మూవీ లో కథానాయికగా ఎవరిని తీసుకుంటే బాగుంటుందా? అని మేము ఎంతగానో ఆలోచించాం. చివరకు శ్రద్ధాకపూర్‌ ఓకే అయ్యింది. ఆమె ను ఎంపిక చేసింది నేను కాదు. ఆ నిర్ణయం పూర్తిగా నిర్మాత దినేశ్ విజయ్‌దే. ఆమెను ఎంచుకోవడానికి గల కారణాన్ని కూడా ఆయన నాతో చెప్పారు. ఓసారి శ్రద్ధాకపూర్, దినేశ్ ఒకే ఫ్లైట్లో ప్రయాణించారట. చాలా సేపు సరదాగా మాట్లాడుకున్నారట. ఆమె అచ్చం దెయ్యంలా నవ్వుతుందని.. అందువల్ల ఈ పాత్రకు తాను అయితే పూర్తి న్యాయం చేయగలదని ఆయన నాతో చెప్పారు’ అని అమర్ కౌశిక్ వెల్లడించారు. ఎంతైన ఒక స్టార్ హీరోయిన్ ని పట్టుకుని ఇలాంటి స్టెట్‌మోంట్ ఇవ్వడం పై నెటిజన్లు అభిమానులు కొంత ఫైర్ అవుతున్నారు.

Exit mobile version