Site icon NTV Telugu

Deepika Padukone: పెళ్లయ్యాక అలాంటి సన్నివేశాల్లో కనిపిస్తే తప్పేంటి?

Deepika Padukone

Deepika Padukone

బాలీవుడ్ అందాల న‌టి దీపికా ప‌దుకొని పెళ్ళైన .. కాస్త‌కూడా స‌మ‌యం లేకుండా అప్ప‌టికంటే.. ఇప్పుడే బిజీ షెడ్యూల్ వుంది. త‌నకు పెళ్ళైనప్ప‌టి నుంచి నేను చాలా ఫ్రీగా వున్నాన‌ని, ఏ రిలేషన్‌లో అయినా నమ్మకం చాలా ముఖ్యమ‌ని చెప్పుకొచ్చారు దీపికా. ఇద్ద‌రి మ‌ధ్య‌ కమ్యూనికేషన్‌ చాలా అవసర‌మ‌ని, ఇవి రెండూ లేకపోతే, ఆ బంధం ముందుకు వెళ్లలేదని అన్నారు. ఒక బంధం నిలుపుకోవాలంటే.. కొన్ని విషయాల్లో ఓపిక అవసరమంటూ దీపిక అన్నారు. కానీ.. పెళ్లయ్యాక అమ్మాయి జీవితం మారిపోవాలి అంతేకాని.. ఇది వరకటిలా ఉండకూడదని అంటారు చాలామంది. అయితే.. పెళ్లికి ముందు దీపికానే కాదా? పెళ్లి తరవాత కూడా దీపికనే క‌దా..అందులో మార్పు ఏముంటుంది? అంటూ దీపిక ప్ర‌శ్నించారు. పెళ్లికి ముందు నేను రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటిస్తే తప్పులేనిది కానీ.. పెళ్లయ్యాక అలాంటి సన్నివేశాల్లో కనిపిస్తే తప్పేముంది? అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

PM Modi : తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా.. అంటూ

అయితే ఈమధ్య నేనో సినిమా చేశానని.. అందులో సన్నివేశానుసారం కథానాయకుడ్ని ముద్దు పెట్టుకోవాల్సివ‌చ్చింది.. అది చూసి మేల్‌ ఈగో హర్టయిపోయిందని ఘాటు వ్యాఖ్య‌లు చేసారు. అయినా.. సినిమా గురించి రణ్‌వీర్‌కు నాకూ బాగా తెలుసు. అయితే.. మాకు లేని ఇబ్బంది, వీళ్లకెందుకో అర్థం కావ‌డంలేద‌ని చెప్పుకొచ్చారు దీపిక‌. పెళ్ళికాకున్న..పెళ్ళైన అంద‌రికి కొత్తబాట తప్పదు అంటూ ప్ర‌స్తావించారు. అయితే ప్ర‌తి అమ్మాకి నేనిచ్చే సలహా ఒకటే! అమ్మాయిలు మీరు ఏమైనా చేయాలనుకుంటే చేేసేయండి. అంతేకానీ.. వాళ్లేమనుకుంటారు.. వీళ్లేం అనుకుంటారు? అంటూ అస్సలు ఆలోచించకండి. ఇది మ‌న జీవితం.. మన జీవితాలపై మరొకరి ఆధిప్యతం ఏమిటంటూ పేర్కొన్నారు. అంతేకాదు..నువ్వు అమ్మాయివి కాబట్టి ఇలానే ఉండు.. అని ఎవరైనా చెబితే అస్సలు వినొద్దు. అయితే.. అలాగని మితిమీరిన స్వేచ్ఛ మంచిది కాదు.. మీ జీవితం ఇంకొకరికి పాఠం కావాలి అంతే గానీ.. గుణపాఠం కారాదని దీపిక అమ్మాల‌కు స‌ల‌హా ఇచ్చారు. మీరు చేసే ప‌నిలో.. మీ అడుగుజాడల్లో మరొకరు నడవాలంటే కొత్త బాటని ఎంచుకోవాల్సిందే అంటూ దీపిక అమ్మాయిల గురించి, సినిమాలో త‌ను చేసిన‌ ముద్దు స‌న్నివేశం గురించి ఘాటుగా స్పందించింది. త‌న విష‌యంలో ఇత‌రులు జోక్యం ఏమిట‌ని అంద‌రికి చుర‌క‌లంటిస్తూ.. దీపికా ఈమాట‌లు చెప్పుకొచ్చింది.

Kishan Reddy : బ్రిటిష్‌వారిపై చెప్పి మరీ దాడి చేశారు అల్లూరి..

Exit mobile version